సొంతంగా సీరం...

క్లెన్సింగ్‌, టోనింగ్‌, మాయిశ్చరైజింగ్‌ తర్వాత అప్లై చేసే సీరం ముఖాన్ని మరింత కాంతిమంతంగా మార్చేయగలదు. ఇన్ని ప్రయోజనాలున్న సీరంలను...

Updated : 01 Oct 2021 05:08 IST

క్లెన్సింగ్‌, టోనింగ్‌, మాయిశ్చరైజింగ్‌ తర్వాత అప్లై చేసే సీరం ముఖాన్ని మరింత కాంతిమంతంగా మార్చేయగలదు. ఇన్ని ప్రయోజనాలున్న సీరంలను సహజసిద్ధంగా ఎలా తయారు చేయాలో చూద్దాం.

కలబందతో... రెండు చెంచాల కలబంద గుజ్జుకు రెండు చెంచాల గులాబీనీటిని కలపాలి. అందులో రెండు విటమిన్‌ ఈ క్యాప్సూల్‌ను కట్‌చేసిన ఆయిల్‌ను వేసి, ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. పొడి సీసాలో దీన్ని భద్రపరుచుకోవాలి. రోజూ ముఖం కడిగిన తర్వాత రెండు చుక్కల సీరం అరచేతిలో వేసుకుని మృదువుగా రాసి మర్దన చేయాలి. పదినిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. రోజుకి రెండుసార్లు ఇలా చేస్తే ఇందులోని యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తాయి. మాయిశ్చరైజర్‌లా పనిచేసి కళ్ల చుట్టూ వలయాలను, కంటి కింద వాపును మాయం చేస్తాయి.

పసుపుతో... గిన్నెలో చెంచా కలబంద గుజ్జు, పావు చెంచా పసుపు వేసి బాగా కలపాలి. అందులో మూడు చెంచాల కొబ్బరి నూనె లేదా జొజోబా నూనెను వేసి కలిపి సీసాలో భద్రపరుచుకోవాలి. నిద్ర పోయే ముందు ముఖానికి రెండు చుక్కల ఈ సీరంను మృదువుగా మర్దన చేసుకోవాలి. ఉదయం శుభ్రం చేసుకుంటే చాలు. ఇంట్లో ఉన్నప్పుడు రెండు గంటలకో సారి దీంతో ముఖాన్ని మసాజ్‌ చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు, మచ్చలు, పిగ్మెంటేషన్‌ వంటివన్నీ దూరమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్