పూలన్నీ తాజాగా...

గది మధ్యలో తాజా చామంతులు.. పడకగదిలో పరిమళాలు వెదజల్లే గులాబీలుంటే మనసంతా ఆహ్లాదమే. గాలికి ఊగుతూ అందంగా పలకరించే పూలు గదులకు కొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. అటువంటి విరులను ఫ్లవర్‌వాజ్‌లో ఉంచిన కాసేపటికే ఒకే చోటకు చేరి వాడినట్లు కనిపిస్తాయి.

Published : 04 Oct 2021 01:15 IST

ది మధ్యలో తాజా చామంతులు.. పడకగదిలో పరిమళాలు వెదజల్లే గులాబీలుంటే మనసంతా ఆహ్లాదమే. గాలికి ఊగుతూ అందంగా పలకరించే పూలు గదులకు కొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. అటువంటి విరులను ఫ్లవర్‌వాజ్‌లో ఉంచిన కాసేపటికే ఒకే చోటకు చేరి వాడినట్లు కనిపిస్తాయి. అలాకాకుండా ప్రతి పువ్వునూ.. విడివిడిగా ఉండేలా ఈ ఫ్లవర్‌ ఫ్రాగ్స్‌ చేస్తాయి. చిన్నచిన్న రంధ్రాలతో ప్లేట్స్‌లా ఉండే వీటిని జార్‌పైన ఉంచి, వాటిలో పూలను సర్దితే చాలు.. తాజాగా ఉంటాయి. ఆసక్తి ఉంటే వీటిని ఇంట్లోకూడా సెరామిక్‌తో తయారుచేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి రకరకాల పరిమాణాల్లోనూ వీటిని సిద్ధం చేసుకోవచ్చు. ఇంకెందుకాలస్యం...మీరూ ప్రయత్నించేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్