పార్లర్‌తో పనిలేకుండా..

పండగ సమయం. అందంగా కనిపించాలని ఏ అమ్మాయికి ఉండదు! అన్నిసార్లూ పార్లర్‌ సరిపడదు. ఇంట్లో ప్రయత్నిద్దామన్నా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాల్సిన ప్రక్రియలను చూస్తేనేమో బద్ధకమేస్తుంది. మరెలా? ఇదిగో ఈ ఒక్కటీ ప్రయత్నిస్తే చాలంటున్నారు నిపుణులు. అదేంటో చదివేయండి.

Updated : 04 Nov 2021 06:08 IST

పండగ సమయం. అందంగా కనిపించాలని ఏ అమ్మాయికి ఉండదు! అన్నిసార్లూ పార్లర్‌ సరిపడదు. ఇంట్లో ప్రయత్నిద్దామన్నా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాల్సిన ప్రక్రియలను చూస్తేనేమో బద్ధకమేస్తుంది. మరెలా? ఇదిగో ఈ ఒక్కటీ ప్రయత్నిస్తే చాలంటున్నారు నిపుణులు. అదేంటో చదివేయండి.
అరకప్పు బియ్యప్పిండికి పావుకప్పుపైగా ఎర్రకందిపప్పు పొడి, రెండు స్పూన్ల చొప్పున ఓట్స్‌, ముల్తానీ మట్టి, చిటికెడు పసుపు, తగినంత పెరుగు, ఎసెన్షియల్‌ ఆయిల్‌/ కొబ్బరినూనె అన్నింటినీ ఒక గిన్నెలో బాగా కలపాలి. ముఖం నుంచి పాదాల వరకు ఒంటికి మొత్తానికి పట్టించి, 5-10 నిమిషాలు వదిలేయాలి. తరువాత మృదువుగా రుద్దుతూ కడిగిస్తే సరి!
వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్‌ యాంటీ ఏజెనింగ్‌గా పనిచేస్తాయి. బియ్యప్పిండి, ఎర్రపప్పుల్లో ప్రొటీన్లు, విటమిన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ముల్తానీమట్టి లోతుగా క్లెన్స్‌ చేసి, మొటిమలు మొదలైనవాటిని దూరంగా ఉంచుతుంది. ఓట్స్‌ మృతకణాలను తొలగిస్తే.. పెరుగు తేమనందిస్తుంది. ఇంకా బోలెడు ప్రయోజనాలున్నాయి. అయితే పొడిచర్మం మీద పూతలా వేయడం మాత్రం మర్చిపోవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్