కె-మేకప్‌ తెలుసా?

కొరియన్‌ సినిమాలు, సిరీస్‌లు యువతను ఆకట్టుకుంటోన్న సంగతి తెలిసిందే! ఇప్పుడు వాళ్ల మేకప్‌ స్టైల్‌ పైనా మనమ్మాయిలు మనసు పారేసు కుంటున్నారు. సహజంగా ఉంటూనే అందంగా కనిపించడం

Updated : 12 Nov 2021 05:46 IST

కొరియన్‌ సినిమాలు, సిరీస్‌లు యువతను ఆకట్టుకుంటోన్న సంగతి తెలిసిందే! ఇప్పుడు వాళ్ల మేకప్‌ స్టైల్‌ పైనా మనమ్మాయిలు మనసు పారేసుకుంటున్నారు. సహజంగా ఉంటూనే అందంగా కనిపించడం దీని ప్రత్యేకత. తారలు సైతం దృష్టిపెడుతున్న దీన్ని మీరూ ప్రయత్నించేయండి...

ముందుగా స్మూత్‌ ఫినిషింగ్‌ ఉన్న బేస్‌ను ముఖానికీ, మెడకీ రాయాలి. లైట్‌ వెయిట్‌, కుషన్‌ ఫౌండేషన్‌ తరహావి ఎంచుకుంటే మేలు. అలాగే పీచ్‌, ఎరుపు, గులాబీ, నారింజ రంగులను పెదాలకు ఎంచుకోవాలి. ఆపై లిప్‌ గ్లాస్‌ పూయాలి.
సన్నగా, విల్లు తరహా కనుబొమ్మలను కాకుండా వీళ్లు నిండైన వాటికి ప్రాధాన్యమిస్తారు. వీటి ద్వారా యూత్‌ లుక్‌ వస్తుందన్నది వాళ్ల అభిప్రాయం. కాబట్టి కాస్త మందంగా ఉండేలా చూసుకోండి. ముఖంలో కళ్లదే ప్రధాన పాత్రగా భావిస్తారట. అందుకే వాటికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. పొడవైన కనురెప్పలు.. కావాలంటే కృత్రిమవాటిని వాడొచ్చు. తర్వాత కనుమొనల్లో మెలి తిరిగినట్టుగా ఐలైనర్‌ రాయాలి. కనురెప్పలపై పీచ్‌, ఎరుపు, లేత గులాబీ రంగులను అద్దాలి. కాస్త గ్లిట్టర్‌ను అద్దితే సరి. పీచ్‌ షిమ్మర్‌ను బ్లష్‌లా చెంపలపై లైట్‌గా అద్దాలి. అంతే..! సంప్రదాయమైనా, ఆధునిక దుస్తులకైనా ఈ లుక్‌ సరిగ్గా సరిపోతుందంటున్నారు స్టైలిస్టులు. మరి.. ప్రయత్నిస్తారా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్