కొంచెం కష్టం కొంచెం ఇష్టం

పొద్దున్నే లేవగానే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి చపాతీ లేదా తేలికపాటి ఆహారం తీసుకోవాలనేదే సాధారణంగా మనందరికీ తెలిసిన సంగతి. కానీ అనేక దేశాల్లో మహిళలు ఇంటర్‌మిటెంట్‌

Updated : 12 Nov 2021 05:34 IST

పొద్దున్నే లేవగానే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి చపాతీ లేదా తేలికపాటి ఆహారం తీసుకోవాలనేదే సాధారణంగా మనందరికీ తెలిసిన సంగతి. కానీ అనేక దేశాల్లో మహిళలు ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడిప్పుడే మనవాళ్లూ దీనివైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా టీనేజ్‌ అమ్మాయిలు చాలామంది ఈ పద్ధతిని అమలుచేస్తున్నారు. ఇంతకీ ఆ ఉపవాసమేంటో, దాని ప్రయోజనాలేంటో చూద్దాం...

ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ అంటే రోజులో 16 గంటల పాటు లేదా వారంలో 24 గంటలు ఏమీ తినకుండా ఉండటం. అంటే రాత్రి 9 నుంచి పగలు ఒంటిగంట వరకూ లేదా వారికి వీలైన 16 గంటల సమయం. ఇందులో ఏం తినాలనే నియమం లేదు, ఎప్పుడు తినాలనేదే ముఖ్యం.

* ‘అమ్మో, అన్ని గంటలు ఉపవాసమా’ అని హడలి పోనవసరం లేదు. సూపర్‌ మార్కెట్లు, రిఫ్రిజిరేటర్లూ లేని ప్రాచీన కాలంలో వేటాడి ఆహారం సంపాదించుకుని అలాగే తినేవారు, అదే ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు.

* కొంత సమయం అభోజనంగా ఉండటం వల్ల శరీరం దృఢంగా ఉంటుంది, అనారోగ్యాలు రావు, మెదడు చురుగ్గా పనిచేస్తుందని అధ్యయనాల్లో తేలింది.

* ఈ ఉపవాస పద్ధతితో కొవ్వు కరిగిపోయి, ఊబకాయం రాదు. బరువు తగ్గడానికి ఇంతకంటే మంచి పద్ధతి లేదు.

* ఈ ఉపవాసం వల్ల కణాల ఉత్పత్తి బాగుంటుంది, ఆరోగ్యకరంగా ఉంటాయి. హార్మోన్ల స్థాయి సమతుల్యంగా ఉంటుంది. కండరాలు బలంగా ఉంటాయి.

* రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. హృద్రోగాలు రావు. ఇన్సులిన్‌ ఉత్పత్తి సవ్యంగా ఉంటుంది. మధుమేహం లాంటి అనేక రోగాలను నిరోధిస్తుంది.

* ముఖంలో ముడతలు రావు. యాంటీ ఏజెనింగ్‌లా ఉపయోగపడుతుంది. ఆయుష్షునూ పెంచుతుంది.

* ఈ లాభాలన్నిటితోబాటు వంట, పాత్రలు కడుక్కోవడం లాంటి పనులు కొంత తగ్గుతాయి. ఇన్ని లాభాలు ఉన్నాయి కనుకనే కొంచెం కష్టమే అయినా ఆడపిల్లలు దీన్ని ఇష్టంగా పాటిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్