కొబ్బరినూనెకు.. మరోటి జత చేస్తే..

జుట్టుకు కావాల్సినంత పోషణను అందించినప్పుడే అది చక్కగా పెరుగుతుంది.  కొబ్బరినూనెకి ఇలా మరిన్ని పదార్థాలను కలిపి పూతలా వేసుకుంటే చాలు.

Updated : 02 Feb 2022 06:24 IST

జుట్టుకు కావాల్సినంత పోషణను అందించినప్పుడే అది చక్కగా పెరుగుతుంది.  కొబ్బరినూనెకి ఇలా మరిన్ని పదార్థాలను కలిపి పూతలా వేసుకుంటే చాలు.

నిర్జీవమైనట్లు కనిపిస్తే... పావు కప్పు కొబ్బరినూనెలో మగ్గిన అరటిపండు గుజ్జు కలిపి జుట్టు, మాడుకు పట్టించాలి. పావుగంట తర్వాత షాంపూ చేస్తే సరి.

జుట్టు చిట్లిందా?  కొబ్బరినూనెకు గుడ్డు తెల్లసొన కలిపి జుట్టుకు పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే చివర్లు ఆరోగ్యంగా మారతాయి.

పీచులా మారితే... జొజొబా, కొబ్బరినూనెలను కలిపి వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు, మాడుకు రాసి కాసేపు మర్దనా చేయాలి. అర గంట ఆగి షాంపూ చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే ఫలితం మీకే తెలుస్తుంది.

చుండ్రు వేధిస్తోంటే... కొబ్బరినూనెలో కాస్తంత అల్లం రసం, నిమ్మరసం కలిపి మాడుకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చుండ్రు తగ్గుముఖం పడుతుంది.

కండిషనర్‌లా కూడా... ఆముదం, కొబ్బరినూనెలను కలిపి కురులకు పట్టిస్తే చక్కటి కండినర్‌లా పనిచేసి హెయిర్‌ ఒత్తుగా పెరుగుతుంది.

పొడవు కావాలా? కలబంద గుజ్జులో కాస్త కొబ్బరి నూనె కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టు అంతా పట్టేలా రుద్దాలి. కాసేపాగి కడిగేయాలి. ఇలా చేస్తే కేశాలు చక్కగా పెరుగుతాయి.

మెరుపు కోసం... సమాన పరిమాణాల్లో కొబ్బరినూనె, తేనె తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించండి. ఇలా చేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది.

రాలుతోంటే.. కొబ్బరినూనెలో మెంతులు వేసి బాగా మరిగించాలి. దీన్ని వడబోసి మాడుకు పెట్టుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్