బంగారాన్ని మెరిపిద్దామా!

బంగారు నగలు కొన్న కొద్దిరోజులకే కళ తప్పినట్లుగా కనిపిస్తుంటాయి. పదే పదే బయట శుభ్రం చేయించాలంటే కొంత కష్టమే! ఈ చిట్కాలను ప్రయత్నించండి. ఇంట్లోనే చక్కగా మెరిపించేయొచ్చు.

Updated : 05 Feb 2022 04:05 IST

బంగారు నగలు కొన్న కొద్దిరోజులకే కళ తప్పినట్లుగా కనిపిస్తుంటాయి. పదే పదే బయట శుభ్రం చేయించాలంటే కొంత కష్టమే! ఈ చిట్కాలను ప్రయత్నించండి. ఇంట్లోనే చక్కగా మెరిపించేయొచ్చు.

* గోరువెచ్చని నీటిలో పాత్రలు కడిగే లిక్విడ్‌ లోషన్‌ కలిపి, వాటిలో నగల్ని ఉంచండి. 15-20 నిమిషాలయ్యాక టూత్‌ బ్రష్‌తో రుద్దితే మురికి పోతుంది. ఆ తర్వాత చల్లని నీటిలో కడిగి, మెత్తని వస్త్రంతో అద్ది, ఆరబెడితే సరి. అయితే వజ్రాలు, పూసలు ఉన్నవాటిని మాత్రం ఈ విధంగా శుభ్రం చేయొద్దు.

* ఖరీదైన రాళ్లు, ముత్యాలు ఉన్నవాటికి సాధారణ నీటిలో గాఢత తక్కువ ఉన్న బాత్‌ లోషన్‌ని కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించండి. అయితే నానబెట్టొద్దు. మృదువైన బ్రష్‌ను ఆ నీటిలో ముంచి రుద్ది చూడండి. శుభ్రపడటమే కాదు.. పూసలు రంగు మారతాయి, రాళ్లు ఊడతాయన్న భయముండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్