వయసును దాచే.. వంటింటి సాధనం

జలుబు చేసినా, చిన్న గాయమైనా పసుపు రాయడం చాలామందికి అలవాటే. కూర ఏదైనా దీని ఉనికి ఉండాల్సిందే. దీని ప్రమేయం రుచి, రంగుకే పరిమితం కావడం లేదు.

Updated : 13 May 2022 15:57 IST

జలుబు చేసినా, చిన్న గాయమైనా పసుపు రాయడం చాలామందికి అలవాటే. కూర ఏదైనా దీని ఉనికి ఉండాల్సిందే. దీని ప్రమేయం రుచి, రంగుకే పరిమితం కావడం లేదు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తోంది.

రోగనిరోధక శక్తి కోసం ఎన్నో రకాల ఆహార పదార్థాలను ప్రయతిస్తుంటాం కదా! వాటిల్లోకి పసుపునీ చేర్చుకోమంటున్నారు నిపుణులు. దీనిలో అధిక మోతాదులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధకతను పెంచుతాయి. వీటి లోపమే అనేక జబ్బులతోపాటు ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌కీ కారణమవుతుంది.

మెదడు పనితీరును మెరుగుపరిచే బీడీఎన్‌ఎఫ్‌ హార్మోను ఉత్పత్తిని పసుపు పెంచుతుంది. అల్జీమర్స్‌నూ దూరంగా ఉంచడంతోపాటు వృద్ధాప్యంలో మెదడు సంబంధిత సమస్యలకూ చెక్‌ పెడుతుంది.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలెక్కువ. దీనిలో ఉండే కుర్‌క్యుమిన్‌ అనే మూలకం ఆర్థరైటిస్‌ వంటి ఎముక సంబంధ సమస్యలను దరి చేరనివ్వదు. గాయాల్నీ త్వరగా మాన్పుతుంది. అంతేకాదు.. ఈ కుర్‌క్యుమిన్‌ గుండె పనితీరును మెరుగుపరచడంతోపాటు రక్తనాళాలనూ శుభ్రపరుస్తుంది. డీఎన్‌ఏ నాశనం కాకుండా రక్షిస్తుంది. వివిధ రకాల జబ్బులకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా వృద్ధాప్య ఛాయల్నీ ఆలస్యం చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్