చెమటకు చెరగకూడదంటే..!

వేసవి వచ్చేసింది. అలా అడుగు బయట పెట్టామా చెమట ధారలు కడుతోంది. ఈ స్థితిలోనూ మేకప్‌ చెరగొద్దా? అయితే ఈ చిట్కాలను పాటించేయండి.

Published : 14 Mar 2022 01:50 IST

వేసవి వచ్చేసింది. అలా అడుగు బయట పెట్టామా చెమట ధారలు కడుతోంది. ఈ స్థితిలోనూ మేకప్‌ చెరగొద్దా? అయితే ఈ చిట్కాలను పాటించేయండి.

మెల్టింగ్‌ ఫౌండేషన్‌, స్మియర్డ్‌ ఐలైనర్‌, స్టిక్కీ లిప్‌స్టిక్‌లకు వేసవిలో దూరంగా ఉండటం మంచిది. ముందుగా ముఖానికి ఆయిల్‌ ఫ్రీ మాయిశ్చరైజర్‌ను పూయాలి. ఇది ఎండవేడికి చర్మాన్ని జిడ్డుగా మారనివ్వదు. ఆ తర్వాత ఎండ ప్రభావం నుంచి రక్షణగా చర్మతత్వానికి సరిపోయే సన్‌స్క్రీన్‌ క్రీం రాయాలి. ఆపై మేకప్‌ ప్రైమర్‌ తప్పనిసరి. ఇది ముఖంపై ముడతలు వంటివి కనబడకుండా మృదువుగా మారుస్తుంది. కొంత పరిమాణంలోనే కన్సీలర్‌ను అద్దుకోవాలి. చెమటకు అవకాశం ఉండే నుదురు, చుబకాలు, ముక్కు, గడ్డం ప్రాంతాల్లో పౌడర్‌ బ్రాంజెర్‌ రాయాలి. మెడకూ అప్లై చేయొచ్చు. ఇది ముఖాన్ని, మెడను తాజాగా కనిపించేలా చేస్తుంది. కనురెప్పలు, చెక్కిళ్లపై అదనపు మెరుపు కోసం రాసే షిమ్మర్‌కు దూరంగా ఉండాలి. ఇది చర్మంపై వేడి ప్రభావాన్ని ఎక్కువ చేస్తుంది. వాటర్‌ప్రూఫ్‌ ఐలైనర్‌ అయితే చెమటకు కరగదు. ముఖ చర్మ వర్ణానికి తగిన లిప్‌స్టిక్‌, కనీకనిపించని లిప్‌లైనర్‌ అధరాల అందాన్ని పెంచుతాయి. ఈ కాలంలో తక్కువ మేకప్‌కే ప్రాధాన్యమివ్వాలి. అలాగే చర్మాన్ని తేమగా ఉంచేలా ఎక్కువ నీళ్లు తాగడంతోపాటు ద్రవపదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్