అందంగా కనిపించాలా...

ఆడపిల్లకీ అందానికీ అవినాభావ సంబంధం ఉంది. గృహిణుల దగ్గర్నుంచీ డాక్టర్లూ, ఇంజినీర్లూ, శాస్త్రవేత్తల వరకూ అందరూ ఆకర్షణీయంగా కనిపించాలనుకుంటారు. అయితే ప్రత్యేక మేకప్‌ లేకుండానే సౌందర్యరాశిలా కనిపించవచ్చు. ఎలాగంటారా.. ఈ చిన్న సూత్రాలు పాటిస్తే చాలు..

Updated : 15 Mar 2022 05:34 IST

ఆడపిల్లకీ అందానికీ అవినాభావ సంబంధం ఉంది. గృహిణుల దగ్గర్నుంచీ డాక్టర్లూ, ఇంజినీర్లూ, శాస్త్రవేత్తల వరకూ అందరూ ఆకర్షణీయంగా కనిపించాలనుకుంటారు. అయితే ప్రత్యేక మేకప్‌ లేకుండానే సౌందర్యరాశిలా కనిపించవచ్చు. ఎలాగంటారా.. ఈ చిన్న సూత్రాలు పాటిస్తే చాలు..

* పరగడుపున గ్లాసు నీళ్లతో మొదలుపెట్టి.. రోజంతా ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగండి. దీనివల్ల సగం ఆరోగ్యం మీ సొంతమైనట్టే. ఆరోగ్యం ఉందంటే అందం ఉన్నట్టే. చర్మం పొడిబారదు. ముఖంలో కాంతి వస్తుంది.

* కాఫీ, టీలు వీలైనంత తగ్గించండి. బదులుగా గోరువెచ్చటి నీళ్లలో కొన్ని సబ్జా గింజలు, చెంచా తేనె వేసుకుని తాగండి. ఫలితాన్ని మీరే చూడండి.
* వీలైతే సాయంత్రమూ స్నానం చేయండి. కుదరకపోతే ముఖం వరకూ చల్లటి నీళ్లతో కడుక్కోండి. సూక్ష్మక్రిములన్నీ తొలగిపోయి ముఖం తేటగా, చూడముచ్చటగా ఉంటుంది.

* రోజూ స్నానం చేసినా... చర్మం మీద మృతకణాలు కొన్ని మిగిలే ఉంటాయి. వాటివల్ల చాయ తక్కువగా కనిపిస్తుంది. ఒకేరకంగా లేకుండా షేడ్స్‌ వస్తాయి. తేటదనం ఉండదు. ఇవన్నీ పోవాలంటే వారానికోసారి సున్నిపిండితో నలుగు పెట్టుకోండి.

* బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్‌ తప్పక రాయండి. చర్మం సురక్షితంగా ఉంటుంది. పరోక్షంగా అందానికి కారణమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్