గోళ్లకీ స్క్రబ్‌!

గోళ్ల అందానికి రంగురంగుల నెయిల్‌ పాలిష్‌, దాని మీద డిజైన్లు.. ఇవేనా? ముఖానికీ, కురులకీలాగే వీటికీ సంరక్షణ కావాలి. అప్పుడే సహజమైన మెరుపుతో ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా.. వీటిని ఇంట్లోనే ప్రయత్నించొచ్చు. ఎలాగంటే.. పావు కప్పు చొప్పున పచ్చిపాలు, రోజ్‌ వాటర్‌ను తీసుకోవాలి. రెండు చేతుల్నీ గోళ్లు మునిగేలా ఉంచాలి. 15 నిమిషాల తర్వాత తీసి, తడి వస్త్రంతో తుడిచి, ఆరనిస్తే సరి. పాలు సహజ మాయిశ్చరైజర్‌లా

Published : 17 Mar 2022 00:49 IST

గోళ్ల అందానికి రంగురంగుల నెయిల్‌ పాలిష్‌, దాని మీద డిజైన్లు.. ఇవేనా? ముఖానికీ, కురులకీలాగే వీటికీ సంరక్షణ కావాలి. అప్పుడే సహజమైన మెరుపుతో ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా.. వీటిని ఇంట్లోనే ప్రయత్నించొచ్చు. ఎలాగంటే..

పావు కప్పు చొప్పున పచ్చిపాలు, రోజ్‌ వాటర్‌ను తీసుకోవాలి. రెండు చేతుల్నీ గోళ్లు మునిగేలా ఉంచాలి. 15 నిమిషాల తర్వాత తీసి, తడి వస్త్రంతో తుడిచి, ఆరనిస్తే సరి. పాలు సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. దీనిలోని లాక్టిక్‌ ఆసిడ్‌ క్యుటికల్స్‌ దృఢంగా అయ్యేలా చేస్తుంది. రోజ్‌వాటర్‌ పసుపు పచ్చని మరకల్ని తొలగించడంతోపాటు గోళ్లు, దాని చుట్టూ ఉన్న చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది.

పావు చెంచా చొప్పున పాల మీగడ, గ్లిసరిన్‌ తీసుకుని దానికి కొన్ని చుక్కల ‘విటమిన్‌ ఈ’ నూనె జోడించండి. దాన్ని బాగా కలిపి గోళ్లకు మర్దనా చేయాలి. ఇవి గోళ్లకు తేమ అందించడంతోపాటు దృఢంగానూ మారుస్తాయి. తరచూ గోళ్లు విరిగిపోయే వారికి ఇది ఉత్తమ పరిష్కారం.

కొందరిలో గోళ్లు పొరలు పొరలుగా లేచిపోతుంటాయి. తీసేయాలని చూస్తే ఒక్కోసారి చర్మంతోసహా ఊడి ఇబ్బంది పెడతాయి. పైగా నొప్పి. దీనికి కాఫీ స్క్రబ్‌ మంచి పరిష్కారం. కాఫీ పొడికి కొద్దిగా కొబ్బరినూనె కలిపి గోళ్లపై మృదువుగా మర్దనా చేస్తే సరి. ఇది మురికిని తొలగించడంతోపాటు గోళ్ల కింది చర్మాన్నీ ఆరోగ్యంగా ఉంచుతుంది. వారానికోసారి ప్రయత్నించండి.. సమస్య తగ్గడంతోపాటు గులాబీ రంగులో మెరిసే గోళ్లూ సొంతమవుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్