కళ్లకి..ఏ క్రీమ్‌?

అందంలో కళ్లదీ ప్రధాన పాత్రే. అందుకే స్కిన్‌ కేర్‌ రొటీన్‌లో ఐ క్రీమ్‌ కూడా తప్పనిసరి అయ్యింది. మరి అది మీ అవసరాలకు తగినదేనా? సరిచూసుకోండి.

Updated : 22 Mar 2022 04:26 IST

అందంలో కళ్లదీ ప్రధాన పాత్రే. అందుకే స్కిన్‌ కేర్‌ రొటీన్‌లో ఐ క్రీమ్‌ కూడా తప్పనిసరి అయ్యింది. మరి అది మీ అవసరాలకు తగినదేనా? సరిచూసుకోండి.

కళ్ల కింద నల్లని వలయాలు.. మనలో చాలామంది సమస్యే. లేత రంగు చర్మం ఉన్నవారికి ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిద్రలేమి, కొన్ని రకాల అలర్జీలు ఇందుకు ప్రధాన కారణాలు. దీనికి కెఫిన్‌, విటమిన్‌ సి గుణాలున్న వాటిని ఎంచుకోవాలి. కెఫిన్‌ కళ్ల కింది రక్తనాళాల వాపును తగ్గిస్తే.. విటమిన్‌ సి మెరుపును అందిస్తుంది.

అలసిపోవడం, గంటల తరబడి నీరు తాగకపోవడం వంటివి కళ్లు ఉబ్బినట్లుగా చేస్తాయి. ఇలాంటివాళ్లు యాంటీ ఆక్సిడెంట్లు ఉండే వాటిని ఎంచుకోవడం మంచిది. గట్టి క్రీమ్‌ తరహావి కాకుండా జెల్‌ లేదా నీటి ఆధారితమైన వాటిని ఎంచుకోవాలి. మసాజర్‌ను వాడితే ఇంకా మంచిది.

కళ్లకింద ఎర్రబడటం, చిన్న దద్దుర్లు వంటివి అక్కడి చర్మం పొడిబారడం కారణంగా వస్తాయి. నూనె గ్రంథులు కుచించుకుపోవడం వల్ల ఇలా అవుతుంది. గ్లిజరిన్‌, హ్యాలురోనిక్‌ ఆసిడ్‌ ఉన్నవాటిని ఎంచుకోవాలి. ఇవి ఆ సున్నిత చర్మానికి కావాల్సిన తేమను అందిస్తాయి.

ముఖంపై ముడతలు ముందు కనిపించేది కళ్ల దగ్గరే! మన ముఖకవళికలు, ఎండ ప్రభావం, కొల్లాజెన్‌ తగ్గడం.. ఇలా దీనికి బోలెడు కారణాలున్నాయి. పరిష్కారంగా రెటినాల్‌ ఉన్నవి ఎంచుకుంటే సరి. ఇది కొత్త చర్మ కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్