ముఖానికి పండు రాస్తే..

వేసవిలో... టాన్‌, యాక్నే, చర్మ ఛాయలో తేడాలు... ఇలా ముఖానికీ ఎన్ని ఇబ్బందులో! వీటన్నింటికీ తాజా పండ్లతో చెక్‌ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.

Published : 31 Mar 2022 01:59 IST

వేసవిలో... టాన్‌, యాక్నే, చర్మ ఛాయలో తేడాలు... ఇలా ముఖానికీ ఎన్ని ఇబ్బందులో! వీటన్నింటికీ తాజా పండ్లతో చెక్‌ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.

పుచ్చకాయ జ్యూస్‌ను కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. దాన్ని కాటన్‌తో ముఖానికీ, మెడకీ పట్టించి ఆరాక కడిగేయండి. దీన్లోని విటమిన్‌ సి ముఖానికి పోషకాలను ఇవ్వడంతోపాటు వృద్ధాప్య ఛాయల్నీ దరి చేరనీయదు.

4-5 నేరేడు కాయలను గుజ్జుగా చేసి, పావు స్పూను తేనె కలపాలి. దీన్ని ముఖానికి రాసి, ఆరాక చల్లని నీటితో శుభ్రం చేస్తే సరి. చర్మం అలసటను దూరం చేయడమే కాక యాక్నే, చిన్నచిన్న కురుపులు వంటివీ తగ్గిస్తుంది. అదనంగా చర్మాన్నీ మెరిపిస్తుంది.

అవకాడో, కివీలను పావుముక్క చొప్పున తీసుకుని మెత్తగా చేయాలి. దానికి పావు  చెంచా తేనె కలిపి ముఖానికీ, మెడకీ పట్టించి, అరగంట ఉంచుకోవాలి. అవకాడోలో ఆల్ఫా, బీటా కెరోటిన్లు ఉంటాయి. ఇవి వాతావరణ మార్పుల కారణంగా చర్మంపై పడిన దుష్ప్రభావాల్ని తగ్గిస్తాయి. కివీలో పెద్ద మొత్తంలో ఉండే సి, ఇ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కొలాజెన్‌ను పెంచుతాయి.

గుడ్డు తెల్లసొనకు నాలుగు స్పూన్ల నారింజ రసం, స్పూను తేనె కలిపి, ముఖానికి మాస్క్‌లా వేయాలి. 20 నిమిషాలయ్యాక తీసేస్తే టాన్‌, మొటిమలు, వాటి మచ్చల నుంచి విముక్తి లభిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్