పొడవుగా కనిపించాలా?
అందంలో పొడవుకీ ప్రాధాన్యమెక్కువే! అందుకే పొట్టి అనిపించుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడరు. ఒక్కోసారి ఆత్మన్యూనతకీ దారితీస్తుంది. అందుకే హైహీల్స్‌ని ఆశ్రయిస్తుంటారు. కానీ వీటితో కాళ్లు, నడుము నొప్పి. ఏ సమస్యా లేకుండా దుస్తులతోనే మాయ చేయొచ్చని తెలుసా?
అందంలో పొడవుకీ ప్రాధాన్యమెక్కువే! అందుకే పొట్టి అనిపించుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడరు. ఒక్కోసారి ఆత్మన్యూనతకీ దారితీస్తుంది. అందుకే హైహీల్స్‌ని ఆశ్రయిస్తుంటారు. కానీ వీటితో కాళ్లు, నడుము నొప్పి. ఏ సమస్యా లేకుండా దుస్తులతోనే మాయ చేయొచ్చని తెలుసా?
* స్ట్రెయిట్ ఫిట్ ప్యాంట్స్.. కాలేజ్, ఆఫీస్, సరదా సమయాలు.. దేనికైనా ఇట్టే సరిపోతాయి. కదలడానికి అనుకూలంగా ఉండటమే కాదు.. కాళ్లపై ఎలాంటి ఒత్తిడీ కలిగించవు. కాస్త పొట్టి షర్ట్ లేదా పొడవైన చొక్కాని ఇన్‌షర్ట్ చేసినా పొడవుగా ఉన్న భావన కలిగిస్తుంది.
* మ్యాక్సీ డ్రెస్.. ముదురు రంగు లేదా చిన్నచిన్న ప్రింట్లు ఉన్న మ్యాక్సీ డ్రెస్‌లు తెచ్చేసుకోండి. జతగా బన్ లేదా పోనీ టెయిల్‌ను వేసుకుంటే సరి. పొడవు లుక్ వచ్చేస్తుంది. సందర్భమేదైనా ఇది చక్కగా నప్పేస్తుంది.
* నిలువుగీతలు.. ఇవి చేసే మాయా అంతా ఇంతా కాదు. నిలువు గీతలు సహజంగానే పొడవుగా కనిపించేలా చేస్తాయి. టాప్స్, షర్ట్స్ వేటిల్లోనైనా ఎంచుకోవచ్చు.
* హై వెయిస్ట్ జీన్స్.. రెగ్యులర్ జీన్స్ పొట్టిగా కనిపించేలా చేస్తున్నాయా? వార్డ్‌రోబ్‌లోకి హై వెయిస్ట్ జీన్స్‌ని చేర్చేయండి. ఇవి కాళ్లు పొడవుగా కనిపించేలా చేస్తాయి. బ్లూ, బ్లాక్ రంగుల్ని ఎంచుకోండి. ఇంకా యాంకెల్ వరకూ ఉన్నవి ఎంచుకుంటే మీరు కోరుకున్న లుక్ దొరికేసినట్లే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.