Updated : 30/07/2022 03:33 IST

బేబమ్మ అందానికి..

తెలుగులో తొలి సినిమాతోనే బేబమ్మగా గుర్తింపు తెచ్చుకొని తమిళం, కన్నడలోనూ వరుస అవకాశాలను దక్కించుకుంటోంది కృతి శెట్టి. ఈ 18 ఏళ్ల అమ్మాయి తన అందం రహస్యం.. ‘ఉదయాన్ని తేనె కలిపిన గోరువెచ్చని నీటితో ప్రారంభిస్తా. స్కిన్‌ కేర్‌ రొటీన్‌పై ఎక్కువ శ్రద్ధ పెడతా. దాన్నో పనిలా కాక ఇష్టంగా చేస్తా. ముఖాన్ని శుభ్రం చేసుకున్నాక ఫేస్‌ మిస్ట్‌, మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీన్‌ రాస్తా. ముంబయి, చెన్నై, హైదరాబాద్‌ల మధ్య నిరంతర ప్రయాణాలు, భిన్న వాతావరణాలు, ఎండ.. పరిస్థితులకు తగ్గట్టుగా ఉత్పత్తులను మారుస్తుంటా. చర్మం పొడిబారుతోంటే ఎక్కువ తేమనందించేది, జిడ్డులా అనిపిస్తోంటే నీటి ఆధారిత మాయిశ్చరైజర్‌ వాడటం లాంటివన్న మాట. స్వీట్లు చాలా ఇష్టం. చర్మానికి చేటని పంచదారతో చేసినవాటికి దూరంగా ఉంటున్నా. వేపుళ్లూ ఎక్కువగా తింటా.. దానికి తగ్గట్టే వ్యాయామాలూ చేస్తున్నా. పెరుగు, కొబ్బరినీళ్లు, పండ్లరసాలు, నీళ్లు ఎక్కువగా తీసుకుంటా. ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతాయి. కురులకు కొబ్బరినూనె తప్పక రాస్తా. ఎప్పుడూ ఆనందంగా ఉంటే అదీ ముఖంలో ప్రతిఫలిస్తుందని నమ్ముతా. అందుకే ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తా. ఎనిమిది గంటల నిద్ర తప్పక ఉండేలా చూసుకుంటా. మనసు బాగాలేకపోతే ఐస్‌క్రీమ్‌ లాగించేస్తా.. అది నా మూడ్‌ను ఇట్టే మార్చేస్తుంది’ అని చెబుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని