సమయం ఆదా అవుతుందిలా!

పండగొచ్చిందంటే.. మనకు పని, పూజ, ఇల్లు అలంకరణ ఇలా బోలెడుంటాయి. తీరా ఆ రోజు మనం సిద్ధమవ్వడానికే సమయముండదు. లేదా ఆలస్యమవుతోందని ఇంట్లో వాళ్ల గోల. అందుకే ఈ చిట్కాలు పాటించి చూడండి. దుస్తులు ఏవి వేసుకోవాలో ముందురోజే నిర్ణయించేసుకోండి. సరిపోతున్నాయా, ఇస్త్రీ అవసరమా వంటివీ చెక్‌ చేసుకుంటే మరుసటి రోజు ఇబ్బందులుండవు. చీర పిన్నుల దగ్గర్నుంచి గాజుల వరకూ...

Published : 30 Aug 2022 00:44 IST

పండగొచ్చిందంటే.. మనకు పని, పూజ, ఇల్లు అలంకరణ ఇలా బోలెడుంటాయి. తీరా ఆ రోజు మనం సిద్ధమవ్వడానికే సమయముండదు. లేదా ఆలస్యమవుతోందని ఇంట్లో వాళ్ల గోల. అందుకే ఈ చిట్కాలు పాటించి చూడండి.

దుస్తులు ఏవి వేసుకోవాలో ముందురోజే నిర్ణయించేసుకోండి. సరిపోతున్నాయా, ఇస్త్రీ అవసరమా వంటివీ చెక్‌ చేసుకుంటే మరుసటి రోజు ఇబ్బందులుండవు. చీర పిన్నుల దగ్గర్నుంచి గాజుల వరకూ అన్నింటినీ పక్కన పెట్టుకోండి. సరిపోయే నగల్నీ సరి చూసుకుంటే తక్కువ సమయంలో సిద్ధమైపోవచ్చు.

పండగలంటే బంధువులు, ఫొటోలు వంటివి సాధారణమే. హెయిర్‌ స్టైల్‌ కూడా ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటున్నారా? మరీ క్లిష్టమైన వాటి జోలికి వెళ్లకండి. సులువుగా పూర్తయ్యేవాటిని ముందే నిర్ణయించేసుకుంటే తర్వాతిరోజు ఎలా వేసుకోవాలన్న సంశయముండదు.

పూజ వంటి విషయాల్లో అందమే కాదు.. హుందాగానూ కనిపించాలి. అప్పుడే సంప్రదాయ లుక్‌ వస్తుంది. తక్కువ మేకప్‌కు ప్రాధాన్యమివ్వండి. మాయిశ్చరైజర్‌ తర్వాత కాస్త బీబీ క్రీమ్‌, కళ్లకు కాటుక, ఐలైనర్‌, పెదాలకు లిప్‌బామ్‌/ లిప్‌స్టిక్‌ వరకూ పరిమితమైతే చాలు. కాస్త పెద్దబొట్టు పెడితే సంప్రదాయ వస్త్రాలకు చక్కగా నప్పుతుంది.

ముందురోజు రాత్రి సమయముంటే కొంగునూ సెట్‌ చేసి పెట్టుకుంటే మరుసటి రోజు కట్టుకోవడం సులువవుతుంది. ఉదయాన్నే కూడా.. పూజకు కావాల్సినవన్నీ పొందిగ్గా సర్దుకున్నాకే చీరకట్టడంపై దృష్టిపెట్టండి. అప్పుడు కంగారుగా అటూ ఇటూ తిరగాల్సిన పనుండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని