మొటిమలు తగ్గించేటొమాటో..

మన వంటింట్లో టొమాటోలు ఎప్పుడూ ఉంటాయి. వాటిని అవసరానికి తగినట్లుగా పప్పులో, కూరలో వేయడమే కాదు.. అప్పుడప్పుడూ చర్మ సంరక్షణకూ ఉపయోగించండి. ఎందుకంటే..

Published : 16 Feb 2023 00:58 IST

మన వంటింట్లో టొమాటోలు ఎప్పుడూ ఉంటాయి. వాటిని అవసరానికి తగినట్లుగా పప్పులో, కూరలో వేయడమే కాదు.. అప్పుడప్పుడూ చర్మ సంరక్షణకూ ఉపయోగించండి. ఎందుకంటే..

* కొందరి ముఖంపై చర్మగ్రంథులు కాస్త పెద్దగా కనిపిస్తాయి. ఓపెన్‌పోర్స్‌గా చెప్పే ఈ సమస్యకు టొమాటో మంచి పరిష్కారం. రెండు చెంచాల టొమాటో రసంలో రెండు చుక్కల నిమ్మరసం, కాస్త తేనె కలిపి ముఖమంతా రాసుకోవాలి. పదిహేను నిమిషాలయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.

* ఓ టొమాటోను గుజ్జుగా చేసి దానిలో రెండు చెంచాల కీరదోస రసం కలపాలి.. దీన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తరవాత కడిగేసి వెంటనే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి. టొమాటోలో ఉండే కూలింగ్‌, యాస్ట్రింజెంట్‌ గుణాలు చర్మానికి సాంత్వన అందించి, అధిక జిడ్డును పీల్చుకుంటాయి. అలా మొటిమలు తగ్గుముఖం పడతాయి.

* ఎండ కారణంగా చర్మం కమిలిపోయినట్లు అయిపోయిందా.. రెండు చెంచాల టొమాటో రసంలో నాలుగు చెంచాల మజ్జిగ, చెంచా పెసరపిండి, కాస్త తేనె కలపాలి. దీన్ని ముఖానికి రాసి, మృదువుగా మర్దన చేయాలి. పూర్తిగా ఆరిపోయాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే సమస్య అదుపులోకి వస్తుంది. అతినీలలోహిత కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా ఉంటుంది.

* ముఖం నిర్జీవంగా మారిందా.. రెండు చెంచాల పెరుగులో సగం టొమాటో రసం, చెంచా నానబెట్టి రుబ్బిన బాదం పేస్ట్‌ కలిపి రాసుకోవాలి. ఇరవై నిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. పెరుగులోని పోషకాలు చర్మాన్ని బిగుతుగా మార్చి, మెరిసేలా చేస్తే, టొమాటో ఉపశమనం అందించి, తాజాగా కనిపించేలా చేస్తుంది. బాదం చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్