Published : 09/03/2023 01:13 IST

90 సెకన్లలో.. ఫేషియల్‌!

వేడుకేదైనా నిగారింపుతో మెరిసిపోవాలి అనుకుంటున్నారు ఈతరం వాళ్లు. అందుకోసం ముందురోజు నుంచే సన్నాహాలు మొదలుపెడతారు. బ్యూటీపార్‌లర్ల చుట్టూ చక్కర్లే. ఇక... ఏ పండుగలు, వేడుకల సమయమో అయితే గంటల తరబడి వేచిచూడాల్సిందే... అలా కాకుండా ఇంట్లోనే మెరిసిపోయే నిగారింపు పొందేందుకు సిద్ధమైపోండి. ఎంతో సమయం కేటాయించాల్సిన అవసరం లేదు... 90 సెకన్లు చాలు... మార్కెట్లో ఫోరియో పరికరం అందుబాటులోకి వచ్చింది. దీన్ని వాడటం కూడా సులభం. పరికరం వెనకాల ఉన్న మూతను తెరవాలి. దానిలో సీరమ్‌ నింపాలి. ముప్పై సెకన్లలో అది వేడవుతుంది. తరువాత ముఖంపై సున్నితంగా రుద్దాలి. అంతే ఖరీదైన స్పాల్లో చేసుకున్నట్లు ముఖం మెరిసిపోవడం ఖాయం. బాగుంది కదూ... ఆన్‌లైన్‌ వేదికల్లో వెతికేయండి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని