పండ్ల తొక్కలతో అందంగా...

ఆరోగ్యం కోసం కొన్ని రకాల పండ్లు తింటాం. వాటి తొక్కలను మాత్రం వృథాగా పడేస్తాం. కానీ, వీటిల్లోనూ బోలెడు పోషకాలు ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

Published : 20 Mar 2024 01:45 IST

ఆరోగ్యం కోసం కొన్ని రకాల పండ్లు తింటాం. వాటి తొక్కలను మాత్రం వృథాగా పడేస్తాం. కానీ, వీటిల్లోనూ బోలెడు పోషకాలు ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

నారింజలో... విటమిన్‌ సి, సహజ నూనెలు పుష్కలంగా ఉంటాయి. నారింజ తొక్కలను  పొడి చేసి కాస్త పెరుగు కలిపి ముఖానికి రాయాలి. ఆరాక శుభ్రం చేస్తే సరి. ఈ ప్యాక్‌  జిడ్డును తొలగించి చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది. మొటిమలూ, వాటి తాలుకు మచ్చల్నీ తగ్గిస్తుంది.

అరటి..  దీని తొక్కలను మెత్తని పేస్టులా చేయాలి. అందులో రెండు స్పూన్ల పాలు కలిపి ముఖానికి రాసి అరగంటయ్యాక శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే... ముడతలు దూరమై ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో బి6, బి12, ప్రొటీన్లు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

యాపిల్‌... ఇది చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. యాపిల్‌ తొక్కలను ముద్దగా చేసి కాసిని పాలు పోసి ముఖానికి రాయాలి. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పిగ్మెంటేషన్‌ను తగ్గించి, సహజ టోనర్ గా పనిచేస్తాయి.

దానిమ్మ...  ఈ పండుకి ఉన్న యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించడంలో సాయపడతాయి. దానిమ్మ తొక్కల పొడిలో కాస్త రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానికి రాసి పది నిమిషాల తరవాత కడగాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్‌ చేసి, కంటికింద నల్లటి వలయాలను దూరం చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్