బరువు తగ్గాలంటే పరుగెత్తాలి!

శరీరం మన నియంత్రణలో ఉంటేనే ఆరోగ్యం, అందం, ఆనందం. ఇందుకు వ్యాయామమే సాధనం. ఈ విషయంలో మహిళలు.... సాధారణంగా నడకకు ప్రాధాన్యమిస్తారు. బదులుగా పరుగు తీస్తే ప్రయోజనాలెన్నో అంటారు వ్యాయామ నిపుణులు. అవేంటంటే...

Published : 13 Jul 2021 02:14 IST

శరీరం మన నియంత్రణలో ఉంటేనే ఆరోగ్యం, అందం, ఆనందం. ఇందుకు వ్యాయామమే సాధనం. ఈ విషయంలో మహిళలు.... సాధారణంగా నడకకు ప్రాధాన్యమిస్తారు. బదులుగా పరుగు తీస్తే ప్రయోజనాలెన్నో అంటారు వ్యాయామ నిపుణులు. అవేంటంటే...

పరుగు వల్ల అధిక కెలొరీలు కరుగుతాయి. దాంతో తక్కువ సమయంలోనే బరువు తగ్గడం సాధ్యమవుతుంది. ఇది ఒంటికే కాదు మెదడుకీ చురుకుదనాన్ని అందిస్తుంది. ముఖ్యంగా శరీరానికి, మెదడుకి మధ్య సమన్వయం పెరుగుతుంది.

* పరుగెత్తడం వల్ల... శరీరంలోని అన్ని అవయవాలకూ వ్యాయామ ఫలితం అందుతుంది. దాని వల్ల ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతమవుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరగడమే అందుకు కారణం. మనం తీసుకునే పోషకాలన్నీ శరీరంలోని అవయవాలన్నింటికీ సక్రమంగా అందుతాయి. వ్యర్థాలు బయటకు పోతాయి.

* కండరాలు దృఢంగా మారడంతో పాటు కాళ్లు, శరీరం చక్కటి ఆకృతిలోకీ వస్తాయి. పరుగు వల్ల మహిళల్లో  రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం సగానికి తక్కువగా ఉంటుందని పరిశోధనలూ చెబుతున్నాయి. అధిక రక్తపోటూ అదుపులో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్