బరువు తగ్గాలా... తొక్కల్నీ తినండి!

ఆరోగ్యంగా ఉండాలంటే తాజా కాయగూరలు, పండ్లను ఆహారంలో చేర్చుకోవాలంటారు ఆహార నిపుణులు. మరి వాటిని ఎలా తీసుకోవాలో కూడా చెబుతున్నారు.

Published : 20 Jul 2021 00:50 IST

ఆరోగ్యంగా ఉండాలంటే తాజా కాయగూరలు, పండ్లను ఆహారంలో చేర్చుకోవాలంటారు ఆహార నిపుణులు. మరి వాటిని ఎలా తీసుకోవాలో కూడా చెబుతున్నారు.

యాపిల్‌ లాంటి పండ్లను తీసుకునేటప్పుడు పొట్టు తీయకుండా నేరుగా తినేస్తే మంచిది. అదొక్కటే కాదు చాలా రకాల పండ్లను (బత్తాయి, పైనాపిల్‌ లాంటివి మినహాయించి) పొట్టుతో తీసుకుంటే పూర్తి పోషకాలు లభిస్తాయి.

* శుభ్రత గురించి పొట్టును తొలగిస్తాం. ఇది సరైన పద్ధతి కాదు. నీళ్లతో కడిగి వాడుకుంటే సరిపోతుంది.

* పై పొట్టు/ తొక్కలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పీచు సమృద్ధిగా ఉంటుంది. పొట్టులోనే దాదాపు 25 నుంచి 30 శాతం ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. పియర్స్‌, పీచ్‌, నేరేడు, ద్రాక్ష, జామ... లాంటి పండ్లను నేరుగా తినేయొచ్చు.

* పీచు ఉన్న కూరగాయలు, పండ్ల వల్ల పొట్ట నిండిన భావన కలిగి ఆకలి వేయదు. దాంతో బరువు నియంత్రణలో ఉంటుంది.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్