శక్తినిచ్చే ఖర్జూరా!

రుచీ, పోషకాలూ అందించే పండు ఖర్జూరం. అమ్మాయిలు రోజూ దీన్ని తింటే రక్తహీనత దరిచేరదు. సమపాళ్లలో పోషకాలు అంది... ఆరోగ్యంతో పాటు అందమూ సొంతమవుతుంది.

Published : 16 Aug 2021 01:11 IST

రుచీ, పోషకాలూ అందించే పండు ఖర్జూరం. అమ్మాయిలు రోజూ దీన్ని తింటే రక్తహీనత దరిచేరదు. సమపాళ్లలో పోషకాలు అంది... ఆరోగ్యంతో పాటు అందమూ సొంతమవుతుంది.

* ఖర్జూరాల్లో కొవ్వు శాతం తక్కువ. విటమిన్లూ, ఖనిజాలూ, మాంసకృత్తులూ సమృద్ధిగా ఉంటాయి. విటమిన్‌ ఎ, బిలను కలిగి ఉండటం వల్ల తినే వారిలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

* ఉద్యోగ, వ్యాపారాల్లో తలమునకలై ఉండే స్త్రీలు... మధ్యలో ఓ రెండు తింటే చాలు. తక్షణ శక్తి అందుతుంది. అలసట మటుయామవుతుంది.

* ఖర్జూరాల్లో పొటాషియం, క్యాల్షియం ఎక్కువ. కడుపు మంటను తగ్గించి, ఎముక బలాన్ని పెంచుతాయి. పీచు అరుగుదలకు సాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించే ఖర్జూరాలు... బరువునీ నియంత్రణలో ఉంచుతాయి. బరువు పెరగాలంటే పాలతో కలిపి తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్