కాబోయే అమ్మ కోసం!

అమ్మ అవబోతున్నారని తెలిసిన క్షణం.. ప్రపంచం అంతా కొత్తగా కనిపిస్తుంది. అనంతమైన సంతోషం మీ మోములో కదలాడుతుంది. ఈ ఆనంద సమయంలో చేయాల్సిన కొన్ని పనుల గురించి తెలుసుకుందామా... పంచుకోండిలా... ఈ సంతోషకరమైన కబురును శ్రీవారికి, కుటుంబ సభ్యులకు తెలియజేయండి. అలాగే కన్నవారికి చెబితే వారూ ఆనందంలో మునిగిపోతారు.

Published : 24 Aug 2021 00:34 IST

అమ్మ అవబోతున్నారని తెలిసిన క్షణం.. ప్రపంచం అంతా కొత్తగా కనిపిస్తుంది. అనంతమైన సంతోషం మీ మోములో కదలాడుతుంది. ఈ ఆనంద సమయంలో చేయాల్సిన కొన్ని పనుల గురించి తెలుసుకుందామా...

పంచుకోండిలా... ఈ సంతోషకరమైన కబురును శ్రీవారికి, కుటుంబ సభ్యులకు తెలియజేయండి. అలాగే కన్నవారికి చెబితే వారూ ఆనందంలో మునిగిపోతారు. ఆ సంతోష సందర్భాలు ఎప్పటికీ మీకు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.  

డాక్టర్‌ను కలవండి... ఇంట్లోనే గర్భనిర్ధారణ కిట్‌తో పరీక్షించుకుని గర్భం వచ్చిందని తెలిస్తే వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. ఆమె పరీక్ష చేసి ఎలాంటి మందులు వాడాలో ఏమేం తినాలో చెబుతారు.  ఈ సమయంలో కాబోయే అమ్మగా మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

మందులు మొదలు.. గర్భం దాల్చిన వెంటనే వైద్యుల సూచనల  మేరకు సప్లిమెంట్స్‌, విటమిన్‌ మాత్రలను క్రమం తప్పకుండా వేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. మీరు వేసుకునే ఈ ప్రీ నేటల్‌ సప్లిమెంట్స్‌ కడుపులోని బిడ్డకు కావాల్సిన పోషకాలనీ అందించి దాని ఎదుగుదలకు తోడ్పడతాయి.

కాఫీ, టీలు ఎక్కువగా వద్దు.. ఈ సమయంలో కాఫీ, టీలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. రోజులో 200 మైక్రోగ్రాముల కంటే కెఫిన్‌ను ఎక్కువగా తీసుకుంటే గర్భస్రావాలయ్యే అవకాశాలున్నాయి. అలాగే బిడ్డ ఎదుగుదలలో లోపాలు ఏర్పడవచ్చు.

పోషకాలకు ప్రాధాన్యం... వేసుకుంటున్న మందులతోపాటు తీసుకునే ఆహారంపై కూడా దృష్టి పెట్టాలి. పోషకాలు మెండుగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే అన్ని పోషకాలూ తీసుకోవాలి.

చికాకులూ తప్పవు... ఆనందమే కాదు శరీరంలో హార్మోన్ల అసమతౌల్యం వల్ల ఈ సమయంలో కొందరిలో తలనొప్పి, వాంతులు, వికారం, త్రేేన్పులు... ఇలా రకరకాల ఆరోగ్య  సమస్యలు వస్తాయి. రోజూ ఎక్కువగా నీళ్లు తాగాలి. వీటివల్ల కొన్ని సమస్యలు నియంత్రించవచ్చు.

జాగ్రత్త సుమా... రక్తస్రావమవడం, తీవ్రమైన కడుపునొప్పి, తెల్లబట్ట కావడం... ఇలాంటి సందర్భాల్లో వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లాలి. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించొద్దు. ఆలస్యం చేయొద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్