అరవైలో ఇరవైలా

పాతికేళ్ల దాకా చురుగ్గా కనిపించిన అమ్మాయిలు ముప్పయ్యో పడిలోకి వచ్చేసరికి ఆ చలాకీతనం కొంచెం తగ్గు ముఖం పడుతుంది. ఇంకో అయిదూ, పదీ గడిచే సరికి ఇంకాస్త నిస్సత్తువ. ఎందుకిలా అంటే రెండు ముఖ్య కారణాలున్నాయి. పోషకాహార లోపం...

Published : 05 Sep 2021 02:20 IST

పాతికేళ్ల దాకా చురుగ్గా కనిపించిన అమ్మాయిలు ముప్పయ్యో పడిలోకి వచ్చేసరికి ఆ చలాకీతనం కొంచెం తగ్గు ముఖం పడుతుంది. ఇంకో అయిదూ, పదీ గడిచే సరికి ఇంకాస్త నిస్సత్తువ. ఎందుకిలా అంటే రెండు ముఖ్య కారణాలున్నాయి. పోషకాహార లోపం... వ్యాయామం చేయకపోవడం అంటున్నారు నిపుణులు. పరిష్కారంగా ఈ చిన్నచిన్న సూత్రాలు పాటిస్తే అరవైలో కూడా ఇరవైలా ఉంటారు. చూడండి మరి...

దయం దోసె, పూరీ వంటి నూనె పదార్థాలు కాకుండా ఇడ్లీ, జొన్నరొట్టె లాంటివి తినడం వల్ల సత్ఫలితాలుంటాయి. ఎన్నో గంటలు ఖాళీ కడుపుతో ఉంటాం కనుక బ్రేక్‌ఫాస్ట్‌ పోషకాలతో నిండి ఉండాలి.

జీర్ణవ్యవస్థ సరిగా లేకపోతే ఆహారం రక్తంగా మారే ప్రక్రియ సజావుగా సాగదు. ఫలితంగా ఊబకాయం వస్తుంది. కనుక నడక లేదా మరో వ్యాయామం దినచర్యలో భాగం కావాలి. దీనివల్ల కండరాల పనితీరు మెరుగవుతుంది. రక్తప్రసరణ బాగుంటుంది. ఎముకలు దృఢపడతాయి.

* రోజూ కనీసం అరగంట ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ధ్యానం మీద మనసు నిలవడంలేదంటే కొంతసేపు కళ్లు మూసుకుని మౌనంగా కూర్చోమని.. అలా కూడా వీలు కాలేదంటే పనులు చేసుకుంటూనే పూర్తి మౌనం పాటించమంటున్నారు డాక్టర్లు.

*ఆహారంలో కాల్షియం, జింక్‌, మెగ్నీషియంలు తగినంత ఉండాలి. అప్పుడే ఎముకలు, కండరాలు దృఢంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. నిద్ర సరిగా పడుతుంది. యాంగ్జయిటీ లాంటి రుగ్మతలు చుట్టుముట్టవు.

* కూతురిగా, తల్లిగా, అమ్మమ్మ / నాన్నమ్మగా స్త్రీలకు అన్ని దశల్లోనూ బాధ్యతలుంటాయి. అవి తప్పవన్నట్టు నిర్వర్తిస్తే బరువనిపిస్తాయి. ఇష్టంగా చేస్తే తేలిగ్గా పూర్తవుతాయని హితవు పలుకుతున్నారు మానసిక నిపుణులు.

*బంధుమిత్రులతో ప్రేమగా ఉండటం వల్ల ఆత్మీయత, ఆసరా లభిస్తాయి. అందువల్ల శారీరక, మానసిక ఆరోగ్యం[మే కాదు, ఆయుష్షు కూడా పెరుగుతుందని సర్వేల్లో తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్