పీసీఓడీ తగ్గాలంటే..

పీసీఓడీ/ పీసీఓఎస్‌.. ఈతరం అమ్మాయిల్లో సహజంగా కనిపిస్తోన్న సమస్య. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు దీంతో బాధపడుతున్నారని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. కొన్ని గింజలను రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే హార్మోన్లు

Published : 11 Oct 2021 01:44 IST

పీసీఓడీ/ పీసీఓఎస్‌.. ఈతరం అమ్మాయిల్లో సహజంగా కనిపిస్తోన్న సమస్య. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు దీంతో బాధపడుతున్నారని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. కొన్ని గింజలను రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే హార్మోన్లు సమతుల్యం కావడంతోపాటు పీసీఓడీ కూడా తగ్గుముఖం పడుతుందంటున్నారు నిపుణులు. అవేంటంటే..

చియా.. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు, ఫైబర్‌, ఐరన్‌, యాంటీ యాక్సిడెంట్లు, క్యాల్షియం ఎక్కువ. ఇవి బరువును తగ్గించడంతోపాటు రక్తంలో చక్కెర స్థాయులనూ మెరుగుపరుస్తాయి.

పొద్దుతిరుగుడు.. సెలీనియం కాలేయాన్ని డీటాక్స్‌ చేస్తుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతోపాటు ఫైబర్‌, ప్రొటీన్లు ఎక్కువ.

గుమ్మడి విత్తనాల్లో.. మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి మెనోపాజ్‌ దశ తర్వాత మహిళల్లో కనిపించే ఆస్టియోపోరోసిస్‌ సమస్యనూ దూరం చేస్తాయి.

అవిసెల్లో.. ఒమేగా 3 ఆల్ఫాలినోలెనిక్‌ యాసిడ్‌, ఫైబర్‌ హార్మోన్ల అసమతుల్యతను తగ్గిస్తాయి. ఈస్ట్రోజన్‌ ఉత్పత్తిని మెరుగుపరచడంతోపాటు గర్భధారణకూ సాయపడతాయి.

నువ్వుల్లో.. క్యాల్షియం, జింక్‌, మెగ్నీషియంలతోపాటు ప్రొటీన్‌ గుణాలెక్కువ. హార్మోన్లను క్రమబద్ధం చేయడంలో సాయపడతాయివి.

వీటిని.. పొడులు, స్మూథీ, పెరుగు, పొడులు, కూరల్లో కలిపి ఎలాగైనా తీసుకోవచ్చు. అయితే తరచూ తీసుకోవడం ముఖ్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్