మూడ్‌ బాలేదా.. తినేయండి!

నిద్రలేమి, అలసట, హార్మోనుల్లో మార్పులు.. మనకెన్ని కారణాలో మనసు బాలేకపోవడానికి! వీటన్నింటికీ ఆహారంతోనే చెక్‌ పెట్టేయొచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే..

Updated : 22 Jan 2022 05:30 IST

నిద్రలేమి, అలసట, హార్మోనుల్లో మార్పులు.. మనకెన్ని కారణాలో మనసు బాలేకపోవడానికి! వీటన్నింటికీ ఆహారంతోనే చెక్‌ పెట్టేయొచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే..

సెరటోనిన్‌.. తెలుసుగా! దీన్నే సంతోష హార్మోన్‌ అంటాం. 90 శాతం వరకూ దీని విడుదలకు జీర్ణాశయంలోని సూక్ష్మజీవులే కారణమవుతాయట. కాబట్టి.. అన్ని వేళల్లోనూ తప్పక ఆహారాన్ని తీసుకోవాలి. లేదంటే ఆ ప్రభావం మెదడుపై పడుతుంది.
ఉదయాల్ని వేడి వేడి కాఫీతో ప్రారంభించడం చాలామందికి అలవాటు. కానీ అది మంచిది కాదట. కెఫిన్‌ మెదడును బలవంతంగా ఉత్తేజితం చేస్తుంది. కాబట్టి, ముందుగా ఎండులా కానీ ఏదైనా పండును కానీ తినమని సూచిస్తున్నారు. ఎప్పుడైనా ఒత్తిడిగా అనిపిస్తున్నప్పుడు బలవంతంగా కడుపు నింపేయకండి. ఆ సమయంలో జీర్ణక్రియ కూడా మందకోడిగా సాగుతుంది. దీంతో మరింత చిరాకు పెరుగుతుంది. అలాంటప్పుడు ఏదైనా ఒక పండు, పెరుగు వంటివి తీసుకోవాలి. బాగా పని చేస్తుంది.
ఉసిరి, తోటకూర, బఠాణి, సెనగ, పసుపు, క్యాబేజీ, ఆకుకూరలు, ఉల్లి, వెల్లుల్లిలను ఎక్కువగా తీసుకోవాలి. సులువుగా అరిగే ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. ఇవి రోగ నిరోధకశక్తిని పెంచడంతోపాటు రక్తపోటు, మధుమేహాన్నీ అదుపులో ఉంచుతాయి. అవిసెలు, చియా, వాల్‌నట్స్‌ వంటి ఒమేగా 3 ఆసిడ్స్‌ ఉండేవీ ఆందోళనను తగ్గించడంలో సాయపడతాయి. ప్రోబయాటిక్స్‌ ఎక్కువగా ఉండే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, పులిసిన ఆహార పదార్థాల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వృద్ధికి సాయపడతాయి. ఇవి డొపమైన్‌, ఎసటైల్‌ కొలైన్‌ వంటి మూడ్‌పై ప్రభావం చూపే న్యూరోట్రాన్స్‌మిటర్లను వృద్ధి చేస్తాయి. నీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. మెదడు చురుగ్గా పనిచేసి, ఆనందానికి కారణమవుతుంది. అలాగే.. బాగా శుద్ధి చేసిన నూనెలు, పంచదార, గ్లుటెన్‌, చక్కెర స్థాయులను అమాంతం పెంచే ఆహార పదార్థాలు, కృత్రిమ రంగులు వంటి వాటికి దూరంగా ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్