నెలసరి మొదలయ్యిందా?

రుతుచక్రం ప్రతి అమ్మాయి జీవితంలో తప్పనిసరి. ఇది మొదలైన తొలినాళ్లలో చాలామంది కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. ఆ సమయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలేంటంటే..

Updated : 30 Jan 2022 06:23 IST

రుతుచక్రం ప్రతి అమ్మాయి జీవితంలో తప్పనిసరి. ఇది మొదలైన తొలినాళ్లలో చాలామంది కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. ఆ సమయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలేంటంటే..

* నెలసరి మొదలైన కొత్తలో ఒకేసారి ఎక్కువ/అధిక రక్తస్రావమవదు. కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. రుతుచక్రం మొదలైన మొదటి రోజు కాస్త పెద్ద సైజు ప్యాడ్‌ను వాడితే ప్యాంటీ, ప్యాంట్‌లకు మరకలు అంటకుండా ఉంటాయి. పీరియడ్స్‌ మొదలయ్యాక కడుపు, నడుము నొప్పులు, కడుపు ఉబ్బరాలు... ఇలాంటి సమస్యలు అందరిలో ఒకేలా ఉండాలని లేదు. ఒక్కొక్కరి శరీరం ఒక్కో నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన పనిలేదు.

* నెలసరి మొదలై ఆరేడు రోజులు కొనసాగినా కంగారు పడాల్సిన పనిలేదు. అయితే నెలలు గడుస్తున్నా... రోజులు పెరుగుతూ ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాలి. నెలసరి ఒకట్రెండు రోజులు ఆలస్యంగానో, ముందుగానో వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఏళ్ల పాటు అలా కొనసాగితే మాత్రం వైద్యులను కలవడం తప్పనిసరి.

* ప్రతి ఐదు గంటలకోసారి ప్యాడ్‌ను మార్చాలి. అలాగే ఆ సమయంలో గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తాజా పండ్లు తింటూ, తగినన్ని నీళ్లు తాగుతూ, విశ్రాంతి తీసుకుంటే  నెలసరి నొప్పి అంతగా బాధించదు. రాత్రి నిద్రించే సమయంలో టాంపున్ల కంటే ప్యాడ్‌ మేలు.

* కొందరికి నెలసరి వచ్చే ముందు ఛాతీలో కొంత అసౌకర్యంగా ఉంటుంది. అలాగే మరికొందరిలో భావోద్వేగాలు ఎక్కువ అవుతాయి. ఊరికే చిరాకు పడటం, కోపం రావడం లాంటి సమస్యలు కనిపిస్తాయి. ఆ సమయంలో యోని నుంచి తెలుపు రంగు డిశ్చార్జ్‌ అవుతుంది. పీరియడ్స్‌ వచ్చే ముందు కొందరిలో తలనొప్పి, నడుము నొప్పులు, వక్షోజాల్లో మార్పులు, మూడ్‌ స్వింగ్స్‌, ఆందోళనా, ఒత్తిడి లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్