కసరత్తులకు కావాలివి

శారీరక, మానసికారోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇంట్లోనే వ్యాయామం మొదలు పెడదామనుకుంటున్నారా.. లేదా వైద్యుల సూచన మేరకు ఫిట్‌నెస్‌ కోసం ప్రయత్నించాలను కుంటున్నారా.

Updated : 18 Feb 2022 01:34 IST

శారీరక, మానసికారోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇంట్లోనే వ్యాయామం మొదలు పెడదామనుకుంటున్నారా.. లేదా వైద్యుల సూచన మేరకు ఫిట్‌నెస్‌ కోసం ప్రయత్నించాలను కుంటున్నారా. మీకు వ్యాయామాలు కొత్త అయితే... మాత్రం కొన్ని వస్తువులు ఇంట్లో ఉండాలి. అవేంటంటే...

స్మార్ట్‌వాచ్‌... వ్యాయామాలు మొదలుపెట్టే ముందు నడక, మెట్లు ఎక్కి దిగడం వంటివి చేయాలి. మొదటిరోజే గంటసేపు నడవకుండా తక్కువ దూరం, సమయం అనుకోవాలి. క్రమేపీ సమయాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్మార్ట్‌వాచ్‌ తప్పనిసరి. లేదా పలు యాప్స్‌ వచ్చాయి. నిర్ణీత సమయాన్ని అనుకుని అందులో ఫీడ్‌ చేస్తే చాలు. అప్పుడే ఎక్కువ లేదా తక్కువ చేయకుండా జాగ్రత్తపడొచ్చు.

స్మార్ట్‌ రోప్‌.. వర్కవుట్స్‌కు స్కిప్పింగ్‌ రోప్‌ చాలా ఉపయోగపడుతుంది. కాళ్లు, చేతుల కండరాలు బలోపేతమవడానికే కాకుండా గుండె ఆరోగ్యానికి ఈ వ్యాయామం బాగా పని చేస్తుంది. మొదటిరోజు పది పదిహేనుతో స్కిప్పింగ్‌ సరిపెట్టండి. రెండో రోజు నుంచి ఆ సంఖ్య కొంచెంకొంచెం పెంచుకుంటూ వెళితే చాలు. అలాగే మీ శరీరం బరువు, వయసును బట్టి ఎన్ని స్కిప్పింగ్స్‌ చేయాలో వైద్యుల సలహా తీసుకుంటే మంచిది.

పోర్టబుల్‌ ట్రెడ్‌మిల్‌.. ఆరుబయట, మేడపై నడవడం ఆరోగ్యానికి మంచిది. ఉదయాన్నే తాజాగాలిని పీల్చుకోవడం మనసుకూ ఆహ్లాదంగా ఉంటుంది. అయితే దానికి సమయం లేదని నడక మానేయకుండా ఉండాలంటే పోర్టబుల్‌ ట్రెడ్‌మిల్‌ తీసుకోవాలి. దీన్ని గది చిన్నదైనా తక్కువ చోటులోనే ఉంచొచ్చు. నియమిత సమయాన్ని పెట్టుకొని దీనిపై రోజూ ఉదయం లేదా సాయంత్రం నడిస్తే చాలు. ఆరోగ్యం మీ చెంత ఉన్నట్లే.

స్మార్ట్‌ కెటిల్‌ బెల్‌.. ఇంట్లో కసరత్తులు చేసేవాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. దీనికీ నిర్ణీత సమయంతోపాటు ఇన్ని సార్లు చేయాలనే ఓ సంఖ్యను పాటిస్తే మంచిది. కండరాలు, ఎముకలు బలోపేతమవుతాయి. శారీరక సామర్థ్యం మెరుగుపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్