ఎప్పుడెప్పుడు తాగాలి?

సాధారణంగా మనం రోజులో ఏడెనిమిది గ్లాసులు లేదా కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలని అందరూ చెబుతుంటారు కదా. అయితే ఏయే సమయాల్లో తాగితే ఎలాంటి ప్రయోజనాలో తెలుసుకుందామా...

Updated : 12 Mar 2022 05:49 IST

సాధారణంగా మనం రోజులో ఏడెనిమిది గ్లాసులు లేదా కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలని అందరూ చెబుతుంటారు కదా. అయితే ఏయే సమయాల్లో తాగితే ఎలాంటి ప్రయోజనాలో తెలుసుకుందామా...
* ఉదయం లేవగానే గ్లాసు గోరువెచ్చని నీటిని తాగండి. దీని వల్ల అంతర్గత అవయవాలన్నీ చురుగ్గా మారతాయి.
*వర్కవుట్లు చేసి అలసిపోయారా.... వ్యాయామం చేసిన తర్వాత నీళ్లు తాగితే శక్తి వస్తుంది. అలసట పోతుంది. వ్యాయామం చేసే ముందూ తాగొచ్చు.
*ఇది కొంచెం వింతగా ఉన్నా ఈసారి చేసి చూడండి. స్నానానికి ముందు ఓ గ్లాసు నీళ్లు తాగండి. ఇలా తాగితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
*రాత్రి నిద్రపోయే ముందు ఓ గ్లాసు నీళ్లు పక్కన పెట్టుకోండి. నిద్రపోయే ముందు ఓ గుక్క తాగినా లాభమే. శరీరంలో ఏవైనా ద్రవాల కొరత ఉంటే తీరిపోతుంది. ఎక్కువ తాగితే నిద్ర మధ్యలో బాత్రూమ్‌కు వెళ్లాల్సి రావొచ్చు.
*లసట, నిస్సత్తువగా అనిపించినప్పుడు వెంటనే నీళ్లు తాగండి. ఈ నీరు శరీరానికి కావాల్సిన తేమను అందించి జీవక్రియలన్నీ సక్రమంగా జరిగేలా చూస్తుంది. దాంతో చురుగ్గా మారిపోతారు.
*ఆకలిగా ఉన్నప్పుడు, తలనొప్పిగా అనిపించినప్పుడు ఓ గ్లాసు నీళ్లు తాగండి వెంటనే ఉపశమనంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్