ఈ రసాలతో ఆరోగ్యం!

ఎండల నుంచి ఉపశమనానికి పండ్ల రసాలు తాగుతున్నారా! వాటికి తోడు కూరగాయల రసాల్నీ తాగేయండి. ఆరోగ్యానికి ఎంతో మేలివి.

Updated : 17 May 2022 17:16 IST

ఎండల నుంచి ఉపశమనానికి పండ్ల రసాలు తాగుతున్నారా! వాటికి తోడు కూరగాయల రసాల్నీ తాగేయండి. ఆరోగ్యానికి ఎంతో మేలివి.

క్యారెట్‌ జ్యూస్‌... రెండు మూడు క్యారెట్లు, అల్లం ముక్కను శుభ్రంగా కడిగి, ముక్కలుగా చేయాలి. వీటిని మిక్సీలో వేసి కాసిన్ని నీళ్లు పోసి గ్రైండ్‌ చేసుకోవాలి. పెద్ద జాలీతో రసాన్ని గ్లాసుల్లోకి వడబోయాలి. దీంట్లో చక్కెర కలిపి ఒకట్రెండు పుదీనా ఆకులు వేసుకుని తాగితే చాలా బాగుంటుంది.
గుమ్మడితో...  శుభ్రంగా కడిగి, పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వీటిని మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. చిన్న మిక్సీలో దాల్చిన చెక్క, లవంగాలు, పోక చెక్క.... కొద్ది మోతాదులో తీసుకుని పొడి చేసి గుమ్మడికాయ రసంలో కలపాలి. గ్లాసులో పోసి ఐసు ముక్కలు వేసుకుని తాగితే ఆహా అంటారు.
సొరకాయతో... నీరు ఎక్కువగా ఉండే సొరకాయని వేసవిలో తింటే చాలా మంచిది. సొరకాయను శుభ్రంగా కడిగి, పొట్టు, విత్తనాలను తీసేసి... సగం ముక్కను తీసుకోవాలి. పుదీనా, తులసి ఆకులను కడిగి పెట్టుకోవాలి. అన్నింటిని మిక్సీ జార్‌లో వేసి, తగినంత రాళ్ల ఉప్పు, మిరియాల పొడి వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. గ్లాసులోకి తీసుకుని ఐసు ముక్కలు కలిపి తీసుకుంటే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్