టీ.. ఆరోగ్యంగా!

మన పని మొదలవ్వాలన్నా.. ఇంట్లో వాళ్లలో పొద్దున్నే చురుకు పుట్టించాలన్నా.. గుర్తొచ్చేది టీనే! దానివల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. అయితే అవి ఇంటిల్లపాదికీ అందుతున్నాయా మరి?

Published : 06 Jun 2022 01:24 IST

మన పని మొదలవ్వాలన్నా.. ఇంట్లో వాళ్లలో పొద్దున్నే చురుకు పుట్టించాలన్నా.. గుర్తొచ్చేది టీనే! దానివల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. అయితే అవి ఇంటిల్లపాదికీ అందుతున్నాయా మరి?

* అరకప్పు బ్లాక్‌ టీకి సాధారణ నీరు, కొంత నిమ్మరసం కలిపి, రోజుకు రెండుసార్లు తీసుకోండి. ఇది రోగనిరోధకతను పెంచడమే కాదు.. కొన్నిరకాల ఫ్లూ, వైరస్‌, బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగానూ పోరాడుతుంది. టీలో ఉండే ఫ్లావనాయిడ్స్‌ గుండెకి ఆరోగ్యాన్నివ్వడంతోపాటు కొలెస్టరాల్‌, రక్తపోటు, చక్కెర స్థాయులను తగ్గిస్తాయి.


* పనుల్లో పడి తిండిని పక్కన పెట్టేస్తాం. ఆకలిని తట్టుకోవడానికి టీని ఆశ్రయిస్తాం. ఆఫీసులో ఒత్తిడిని తట్టుకోవడానికీ మనకు కనిపించే మార్గమిదే. కానీ రోజుకు మూడు కప్పులకు మించకూడదు. నిద్రకు కనీసం రెండు గంటల ముందూ తీసుకోకూడదు. లేదంటే నిద్రను దూరం చేస్తుంది.


* జీర్ణసంబంధ సమస్యలు, అసిడిటీ వంటివి రాగానే వైద్యులిచ్చే సూచనల్లో టీ, కాఫీ మానేయమనేదొకటి. టీ మెదడును ఉత్తేజితం చేస్తుందన్న మాట నిజమే. కానీ అసిడిటీకీ కారణమవుతుంది. కాబట్టి, పరగడపున తీసుకోవద్దు. లేచాక కనీసం గంట తర్వాత కుదరకపోతే మంచినీళ్లు లేదా ఏదో ఒకటి తిన్నాకే తాగమంటున్నారు నిపుణులు.


* బయట తినేప్పుడు కూల్‌ టీ, ఫ్లేవర్డ్‌ కాఫీలను తీసుకోవడం సాధారణమే. ఇవి ఆహారంలో ఉండే ఐరన్‌ను గ్రహించేస్తాయి. వీటిల్లో ఉండే చక్కెరలు శరీరానికి హాని చేస్తాయి. టీలో పంచదారకు బదులుగా బెల్లం వేసుకోవడం మంచిది. అల్లం, లెమన్‌ గ్రాస్‌, యాలకులు వంటివి జోడించుకుంటే అదనపు ఆరోగ్య ప్రయోజనాలూ అందుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్