లక్ష్యంతో మొదలుపెట్టాలి!

ఇంతకు ముందు నేనూ చాలా సన్నగా ఉండేదాన్ని.. డెలివరీ తర్వాతే ఇంత లావుగా తయారయ్యాను. రోజూ వ్యాయామం చేసి ఎలాగైనా సన్నబడదాం.. అనుకున్నారా...

Published : 16 Apr 2023 00:51 IST

ఇంతకు ముందు నేనూ చాలా సన్నగా ఉండేదాన్ని.. డెలివరీ తర్వాతే ఇంత లావుగా తయారయ్యాను. రోజూ వ్యాయామం చేసి ఎలాగైనా సన్నబడదాం.. అనుకున్నారా... కానీ రెండు రోజులు వ్యాయామం చేసి మళ్లీ బద్ధకిస్తున్నారా? ఇలా అయితే నాజూగ్గా ఎలా అవుతాం అని నిరాశ కూడా పడుతున్నారా.. అలాకాకుండా నిర్దిష్ట లక్ష్యాలను పెట్టుకోండి. అనుకున్నది సాధిస్తారు. అవేంటో చదివేయండి మరి..

తెలుసుకోండి.. మీరు ముందుగా అసలు వ్యాయామం ఎందుకు చేయాలనుకుంటున్నారు. అనారోగ్యం కారణంగానా లేదా లావుగా ఉన్నామనా ఏదో ఒకటి నిర్ణయించుకోండి. మీ ఎత్తుకు తగ్గట్టు బరువు, నడుము కొలతలు ఎంత ఉండాలనేది తెలుసుకోండి. తర్వాతే వ్యాయామం మొదలుపెట్టండి.

భాగస్వామితో పాటు... ఎవరి ఒత్తిడి మీదో ఒప్పుకొన్నట్టు కాకుండా చేసే పనిని ప్రేమించండి. అప్పుడే దాన్ని కొనసా గించగలరు. మీకు తోడుగా స్థిరంగా ఉండే వారిని వ్యాయామం చేసేందుకు భాగస్వాములుగా ఎంచుకోండి. అప్పుడు బద్ధకించకుండా రోజూ వ్యాయామం చేస్తారు.

ఆస్వాదిస్తూ.. మీకు బాగా నచ్చిన ప్రదేశాన్ని ఎంచుకోండి. అదీ గార్డెన్‌ ఏరియా అయితే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇష్టమైన పాటల్ని వింటూ ఆస్వాదించండి. మాస్‌ బీట్‌లను వినండి. మరింత ఉత్సాహంగా చేస్తారు.

పోల్చుకోవద్దు... నాతో పాటే కదా మీరు మొదలు పెట్టారు.. మీరు ఇంత తొందరగా బరువెలా తగ్గారని పక్కవారితో పోల్చుకోకండి. అలా చేస్తే మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ప్రతి ఒక్కరి శరీరంలో హార్మోన్ల కారణంగా చాలా తేడా ఉంటుందని గుర్తుంచుకోండి. మీ పద్ధతిలో మీరు వ్యామామం చేయండి. దాంతో పాటు సమతుల ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్