కూర్చునే చేసే వ్యాయామం!

ఇంట్లో హడావుడిగా పనులన్నీ ముగించుకొని ఆఫీసుకెళ్తాం. అక్కడ వెళ్లిన దగ్గరినుంచి వచ్చే వరకూ కూర్చొనే చేసే పనులే అయితే మెడ, వెన్ను సమస్యలు తప్పవు. రోజూ వ్యాయామం చేస్తే ఈ సమస్య నుంచి కొంత మేర ఉపశమనం లభిస్తుంది.

Updated : 20 Apr 2023 13:30 IST

ఇంట్లో హడావుడిగా పనులన్నీ ముగించుకొని ఆఫీసుకెళ్తాం. అక్కడకు  వెళ్లిన దగ్గరినుంచి వచ్చే వరకూ కూర్చుని చేసే పనులే అయితే మెడ, వెన్ను సమస్యలు తప్పవు. రోజూ వ్యాయామం చేస్తే ఈ సమస్య నుంచి కొంత మేర ఉపశమనం లభిస్తుంది. కానీ దానికి సమయం లేకపోతే కూర్చున్న చోటు నుంచే శరీరాన్ని స్ట్రెచ్‌ చేయొచ్చు. అదెలాగో చూద్దామా..

మోకాలిని.. కూర్చున్న చోటే వెన్నుపూసని నిటారుగా ఉంచి రెండు చేతులను కిందికి దించి కుర్చీని పట్టుకోవాలి. తర్వాత కుడి మోకాలిని సమానంగా ఉంచి కిందికీ పైకి ఊపాలి. అలా పదిసార్లు చేశాక ఎడమ కాలితో కూడా అలాగే చేయాలి. ఇలా చేస్తే పాదం దగ్గరినుంచి తొడల వరకూ కదలిక జరుగుతుంది. దాంతో రక్త సరఫరా మెరుగుపడి కాళ్లనొప్పుల నుంచి కొంత ఉపశమనం దొరుకుతుంది.

మార్చ్‌...  కుర్చీలో నిటారుగా కూర్చొని చేతులను మోకాళ్ల మీద ఉంచి మార్చ్‌ చేయండి. ముందు కుడి కాలితో తర్వాత ఎడమ కాలితో అయిదు నిమిషాల పాటు చేసి ఒక రెండు నిమిషాల పాటు కాళ్లకు విశ్రాంతి ఇవ్వండి. ఇలా చేయటం వల్ల కాలి కింది నుంచి పిరుదుల వరకూ కదులుతూ కాళ్లకు మంచి మసాజ్‌ అవుతుంది. తుంటి నొప్పులు కూడా దరిచేరవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని