ఎక్కువగా ఆలోచిస్తుంటే..

ఆలోచించడం, బాధపడటం మానవ సహజం. కానీ కొంతమంది అతిగా ఆలోచిస్తుంటారు. చిన్నచిన్న వాటికే ఎక్కువగా ప్రభావితమవుతుంటారు. ఆ సునామీలో కొట్టుకుపోతుంటారు. వాటి నుంచి బయటపడలేక ఒత్తిడికి లోనవుతుంటారు.

Updated : 10 Jun 2023 14:17 IST

లోచించడం, బాధపడటం మానవ సహజం. కానీ కొంతమంది అతిగా ఆలోచిస్తుంటారు. చిన్నచిన్న వాటికే ఎక్కువగా ప్రభావితమవుతుంటారు. ఆ సునామీలో కొట్టుకుపోతుంటారు. వాటి నుంచి బయటపడలేక ఒత్తిడికి లోనవుతుంటారు. మానసిక సంతులతను దెబ్బతీసే ఈ సమస్యల నుంచి బయటపడటానికి నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు... అవేంటో చూసేద్దామా.

కారణం తెలుసుకోండి... అతిగా ఆలోచించడానికి కారణం తెలుసుకోండి. మిమ్మల్ని ఎక్కువగా బాధించే విషయాన్ని పదేపదే గుర్తుచేసుకోడానికి ప్రయత్నించకండి. ఆ విషయంలో మీకు తప్పు చేసిన భావన ఉంటే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. సరిదిద్దలేనిది అయితే బాధపడినా లాభం లేదని తెలుసుకోండి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి.

మనసు మళ్లించండి... ఆలోచనలకు తావు లేకుండా మనసును మళ్లించండి. పాటలు వినడం, వంట చేయడం, పెయింటింగ్స్‌ వేయడం, డ్యాన్స్‌,  సన్నిహితులతో గడపడం, విహారయాత్రలు, మొక్కలను పెంచడం, సామాజిక సేవ, అనాథ లేదా వృద్ధాశ్రమాలు సందర్శించడం వంటివి అతి ఆలోచనల నుంచి విరామాన్ని ఇస్తాయి.
వ్యాయామాలు... శ్వాస మీద ధ్యాస ఉంచే వ్యాయామాలు చేయండి. మీ మీద మీరు నియంత్రణ సాధించేందుకు ఇవి సహాయ పడతాయి. జిమ్‌కు వెళ్లండి. ఫిట్‌నెస్‌ మీద దృష్టి పెట్టండి. శారీరక శ్రమ మానసిక సమస్యల నుంచి దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. ఉత్తేజ పరుస్తుంది.

ఇతరులకు సహాయం చేయండి... వీలైనంత మేరకు ఇతరులకు సహాయం చేయండి. ధార్మిక, సామాజిక సేవల్లో పాల్గొండి. రోజులో కొంత సమయం దీనికి కేటాయించండి. ఇతరుల సమస్యలను దగ్గర నుంచి చూసే వీలుంటుంది కనుక మనం ఎంత ఉన్నతమైన జీవన శైలిని పొందామో అర్థం అవుతుంది. చిన్న చిన్న నిరాశలు దరిచేరకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని