ఆ అలవాటుందా... అయితే జాగ్రత్త!

తెలియకో, ఏదో ఆలోచనలో ఉండో మనలో కొంతమందికి ముక్కులో వేలు పెట్టే అలవాటు ఉంటుంది. అదేపనిగా తిప్పుతూ కూడా ఉంటారు.

Published : 10 Mar 2024 01:34 IST

తెలియకో, ఏదో ఆలోచనలో ఉండో మనలో కొంతమందికి ముక్కులో వేలు పెట్టే అలవాటు ఉంటుంది. అదేపనిగా తిప్పుతూ కూడా ఉంటారు. ఆ జాబితాలో మీరూ ఉన్నారా? అయితే జాగ్రత్త! ఎందుకంటే ఈ దురలవాటు మనలో ఆల్జీమర్స్‌ వ్యాధికి కారణమవుతుందని తాజాగా వెస్ట్రన్‌ సిడ్నీ యూనివర్సిటీలో చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. ఈ అలవాటు ఉన్నవాళ్లలో ప్రమాదకరమైన వైరల్‌, బ్యాక్టీరియల్‌, ఫంగల్‌ పాథోజెన్ల లాంటివి ముక్కు ద్వారా మెదడులోకి చేరి ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తున్నాయట. ఇది క్రమంగా మన ఆలోచలు, జ్ఞాపకశక్తి, భాషపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. మెదడు జీవక్రియనూ, జీర్ణప్రక్రియ- మెదడు సంబంధాలను నియంత్రించి ఆల్జీమర్స్‌కి దారితీస్తుందట. మెదడులో అమిలాయిడ్‌, ప్రొటీన్లు అసాధారణ రీతిలో పోగై మెదడు కణాలు చనిపోయేలా చేసి ఈ మతిమరుపు వ్యాధికి కారణమవుతుంది. న్యుమోనియా, చిగుళ్ల సమస్యలు, హెర్పెస్‌ వంటి ఇన్‌ఫెక్షన్లూ ఈ వ్యాధితో ముడిపడి ఉన్న లక్షణాలే. అందుకే ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. తప్పనిసరి అయితే, ముందు చేతులను శుభ్రపరచుకోండి. దీనివల్ల హానికారక బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించకుండా నివారించగలం. అప్పుడే ఆల్జీమర్స్‌తో పాటు ఇతర నరాలకు సంబంధించిన డిజార్డర్లూ రాకుండా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్