చిన్నారుల్లో ఆర్థిక అవగాహన...

సాధారణంగా చాలా మంది పిల్లలెదుట ఆర్థిక విషయాలు చర్చించరు. కానీ వారికి బాల్యం నుంచి కొంతైనా ఆర్థిక అంశాలపై అవగాహన కలిగించడం ముఖ్యమంటున్నారు నిపుణులు. వారికిచ్చే...

Updated : 21 Nov 2021 06:34 IST

సాధారణంగా చాలా మంది పిల్లలెదుట ఆర్థిక విషయాలు చర్చించరు. కానీ వారికి బాల్యం నుంచి కొంతైనా ఆర్థిక అంశాలపై అవగాహన కలిగించడం ముఖ్యమంటున్నారు నిపుణులు. వారికిచ్చే కానుకల ఖరీదు, దాని వెనుక ఉన్న కష్టం గురించైనా వారికి తెలియాలంటున్నారు. ఆ అవగాహన వారికి భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ప్రాథమిక దశ నుంచి.. చిన్నారులకు డబ్బు విలువ తెలియాలంటే ముందు పొదుపు నేర్పాలి. ఈ శిక్షణలో భాగంగా ప్రతినెలా వారికి కొంత పాకెట్‌మనీ ఇవ్వాలి. దాన్ని పొదుపు చేసేలా చిన్న కిడ్డీ బ్యాంకు కొనివ్వాలి. అలా వారు దాచుకున్న డబ్బుతోనే వారికిష్టమైనవి కొనుక్కోవచ్చని చెప్పాలి. అలా చేస్తే వారిలో పొదుపు చేయాలనే ఉత్సాహం మొదలవుతుంది. దీంతోపాటు వారికిచ్చే కానుకలు, వారిపై చేసే ఇతర ఖర్చుల వివరాలను చెబుతుండాలి. ఎన్ని నెలలు పొదుపుచేస్తే ఆ బొమ్మ ఖరీదు వస్తుందో లెక్క వేసి చెప్పాలి. ఇవన్నీ వారిని దుబారాకు దూరం చేస్తాయి. డబ్బు విలువ తెలుసుకుంటారు. ఆర్థిక అవగాహనా కలుగుతుంది.

ఆర్థిక నిర్వహణ.. పిల్లలకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత అవసరాలను వారు పొదుపు చేసిన నగదుతో కొనుక్కోవాలని చెప్పాలి. దాంతో తమకు కావాల్సిన వస్తువుల ధర, వాటి కోసం చేయాల్సిన పొదుపు, ఎన్ని రోజులు పడుతుంది వంటి అంశాలపై ఆలోచనా పరిజ్ఞానం పెంపొందుతుంది. తాము పొదుపు చేసిన నగదుతో అమ్మానాన్న, తోబుట్టువులు, స్నేహితులకు ప్రత్యేక సందర్భాల్లో కానుకలు కొనివ్వడం నేర్పించాలి. అప్పుడే ఏయే వస్తువులకు ఎంతెంత ఖర్చు అవుతుందో వారికీ అవగాహన పెరుగుతుంది. దీంతో తమ వద్ద ఉన్న నగదును ఎలా వినియోగించాలా అన్న ఆర్థిక నిర్వహణ నేర్చుకుంటారు. ఇవన్నీ పిల్లలను భవిష్యత్తులో వారి కాళ్లపై వారు నిలబడేలా ధైర్యాన్నిస్తాయి. ఆర్థిక ప్రణాళికతో ముందడుగు వేసేలా చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్