నెమ్మదిగా చెబుతూ.. నిద్ర లేపండి
close
Updated : 01/12/2021 05:39 IST

నెమ్మదిగా చెబుతూ.. నిద్ర లేపండి!

రాశికి తన ఏడేళ్ల కూతురిని ఉదయాన్నే లేపడం పెద్ద పని. రాత్రేమో పడుకోదు, ఉదయాన్నే లేవదు. అయితే పిల్లలకు రోజుకి కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం. నిద్రలేమితో శారీరక, మానసిక సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందనేది నిపుణుల మాట. కాబట్టి, దీనిపై ముందు నుంచీ జాగ్రత్త వహించాలి.

రాత్రుళ్లు చిన్నారులను త్వరగా నిద్రపోయేలా అలవాటు చేయాలి. సాయంత్రం త్వరగా తినిపించి ఆపై హోం వర్క్‌ వంటివి చేయించాలి. తొమ్మిది గంటలకల్లా నిద్రపోవడానికి తగిన వాతావరణాన్ని కల్పించాలి. పెద్దవాళ్లందరూ టీవీ చూస్తూ కూర్చుంటే పిల్లలు మాత్రం ఎందుకు మాట వింటారు? కాబట్టి పిల్లలు నిద్రపోయేవరకు టీవీని ఆపేసి, వాళ్లతో ఉండండి. చిన్న చిన్న కథలు, కబుర్లు చెబితే వింటూ త్వరగా నిద్రలోకి జారుకుంటారు. ఉదయాన్నే వాళ్లంతట వాళ్లే ఉత్సాహంగానూ లేస్తారు. దీంతో జీర్ణశక్తి పెరగడమే కాకుండా ఎదుగుదలపైనా మంచి ప్రభావం పడుతుంది.

* ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి వాళ్లని స్కూలు పేరిట హడావుడి పెట్టొద్దు. కాస్త సమయమివ్వండి. లేవగానే చిన్ని బుర్రలు తేరుకోవాలి కదా! పది, పదిహేను నిమిషాలు వదిలేస్తే తేరుకుంటారు. అలాకాకుండా తిట్లదండకాన్ని అందుకోవడమో, చేయి చేసుకోవడమో చేస్తే ఆ పసిమనసు ఒత్తిడికి గురవుతుంది. మొండితనం మొదలై, పూర్తిగా చెప్పిన మాట వినకుండా తయారవుతారు. రోజూవారీ పనులు చేసుకోవడానికి అయిష్టత ప్రదర్శిస్తారు. పిల్లలు లేచాక వాళ్లతో మృదువుగా ప్రవర్తిస్తే.. వారిలో మంచి ప్రవర్తనకు కారణమవుతారు. లేదంటే.. వారికిష్టమైన విషయాన్ని బొమ్మలో, టూరో, పోనీ నచ్చిన వంటకం చేశామనో చెప్పండి. వారిలో నూతనోత్సాహాన్ని మీరే గమనిస్తారు. వాళ్లు బాధగా, ఏడుస్తూ  ఉంటే మన రోజు మాత్రం ఏం బాగుంటుంది చెప్పండి?  కాబట్టి నెమ్మదిగా  ప్రయత్నించండి.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని