అర్థం కావాలంటే.. మాట్లాడాలి

ఆలుమగలన్నాక ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. కలిసి నడవాలి. నిజమే.. కానీ ఇది సవ్యంగా సాగాలంటే.. కలిసి జీవిస్తే సరిపోదు. ఒకరి గురించి మరొకరికి తెలియాలి. ఇందుకు మాట్లాడటమే మార్గమంటున్నారు నిపుణులు.చాలావరకూ బంధాల మధ్య బీటలు వచ్చేది ఎదుటివారితో మనసులోని

Updated : 25 Jan 2022 04:38 IST

ఆలుమగలన్నాక ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. కలిసి నడవాలి. నిజమే.. కానీ ఇది సవ్యంగా సాగాలంటే.. కలిసి జీవిస్తే సరిపోదు. ఒకరి గురించి మరొకరికి తెలియాలి. ఇందుకు మాట్లాడటమే మార్గమంటున్నారు నిపుణులు.

చాలావరకూ బంధాల మధ్య బీటలు వచ్చేది ఎదుటివారితో మనసులోని మాటను బయటపెట్టకపోవడం వల్లనే. ప్రతిదీ చర్చించుకోవడం, నిజాయతీగా ఉండటంపైనే బంధం నిలబడుతుంది. కాబట్టి, మంచైనా, చెడైనా ఎదుటివారికి తెలియజేయండి. ఉదాహరణకు మీ భాగస్వామిది ఏదైనా అలవాటు నచ్చలేదు. చెప్పేయండి. లేదా కొంచెం సర్దుకుపోవచ్చు. వాళ్లూ మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాకాకుండా గొడవ జరుగుతుందని సమస్యను దాటవేస్తూ వస్తే భవిష్యత్‌లో అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.

పరస్పర గౌరవం.. పెళ్లైన కొత్తలోనే అవతలి వారి నుంచి ఏం కోరుకుంటున్నారనేది స్పష్టంగా చెప్పాలి. ఆర్థిక, మానసిక, భావోద్వేగపరంగా అన్ని అంశాల గురించీ మాట్లాడుకోవాలి. ఎదుటివారి ఆశలు, కోరికలకు ఒకరికొకరు గౌరవమివ్వాలి. అప్పుడే బంధంలో భద్రత ఏర్పడుతుంది.

మెచ్చుకోండి.. చాలామంది నచ్చనిదాన్ని ఎక్కువగా ఎత్తి చూపుతుంటారు. నచ్చిన అంశాన్ని మాత్రం బయటపెట్టరు. బాలేదనలేదంటే మెచ్చుకున్నట్టేగా అన్న భావన. రోజూ ఏం చెబుతామనే నిర్లక్ష్యం. అదెప్పుడూ మంచిది కాదు. అభినందన బంధం బలపడేలా చేస్తుంది. మనసుని బయటపెట్టేలా చేస్తుంది. ఫలితమే ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం.

అరవొద్దు.. చిన్ని చిన్ని అలకలు, కోపాలు సహజమే. ఎదుటివారి వల్ల తప్పు జరిగిందా.. అర్థమయ్యేలా చెప్పండి. కావాలని ఎవరూ పొరబాటు చేయరు కదా! అలాకాదని అరిచేస్తే.. అది ఏర్పరచిన దూరం పూడటానికి చాలా సమయం పట్టొచ్చు. అందుకే సున్నితంగా చెప్పండి. లేదూ.. కోపం పోయేవరకూ మౌనాన్ని అయినా ఆశ్రయించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్