Published : 31/01/2022 01:11 IST

నువ్వు నా పక్కనుంటే...

పెళ్లయిన కొత్తలో కొన్నాళ్లు అన్యోన్యంగానే ఉంటారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనట్లుగా అనుబంధానికి చిరునామాలా ఉంటారు. కానీ కాలం గడిచేకొద్దీ విసుగులూ అసహనాలూ లోపాలు ఎత్తిచూపుకోవడాలూ.. ఇంకా చిరాకేస్తే నిందించుకోవడాలు... ఇలాంటి అపశ్రుతులకు తావు లేకుండా ఈ సూత్రాలు పాటించి చూడండి...

* లోకంలో ఏ ఒక్కరూ పరిపూర్ణులు కారు, నిర్దుష్టంగా ఉండరు. ఏవో బలహీనతలు ఉంటూనే ఉంటాయి. ఇంత చిన్న సత్యాన్ని అర్థం చేసుకుంటే చాలు.. ఇళ్లల్లో గొడవలూ ఘర్షణలూ లేకుండా సంతోషంగా ఉండొచ్చు. కాస్తంత సరిపెట్టుకునే లక్షణాన్ని అలవర్చుకుంటే కోపతాపాలకు ఆస్కారమే ఉండదు. ఒకరిపట్ల ఒకరికి ప్రేమ ఉన్నప్పుడు తప్పులూ పొరపాట్లు దొర్లినా అర్థం చేసుకోగలుగుతారు.

* ‘నువ్వు పక్కన లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది’ అని చెప్పి చూడండి. మీ భాగస్వామి ముఖం పరవశంతో వెలిగిపోదా? ఒకరి సమక్షాన్ని ఒకరు కోరుకోవడం కంటే ఆనందం ఇంకేదీ ఉండదు కదూ!

* సంసారమన్నాక చిన్నచిన్న త్యాగాలూ సర్దుబాట్లూ తప్పవు. అలాంటప్పుడు ఆ పనేదో ఇష్టంగానే చేసేస్తే భాగస్వామికి ప్రేమ, కృతజ్ఞతాభావం కలుగుతాయి. అందుకు భిన్నంగా మోయలేని భారం మోస్తున్నట్టో, తూలనాడుతూనో చేస్తే ప్రేమకు బదులు వ్యతిరేకత చోటుచేసుకుంటుంది.

* భాగస్వామి విషయంలో మనవాళ్లు మనకే పరిమితం అనుకోవడం సాధారణమే. కానీ మరో వ్యక్తితో మాట్లాడినా, కాసేపు ఎక్కడికైనా కలిసి వెళ్లినా పరాధీనమైపోతున్నట్టు అనుమానించడం లేదా అవమానించడం వల్ల సంసారం అల్లకల్లోలం అవుతుంది. సానుకూల దృక్పథంతో చాలా సమస్యలు ఇట్టే సమసిపోతాయి.

* మీ వాళ్లు, మా వాళ్లు అనే తేడాలను రానీయొద్దు. పెళ్లి ఇద్దరు వ్యక్తులనే కాదు, ఇరు కుటుంబాలనూ ఒకటి చేసిందని గుర్తుంచుకుని ఇద్దరి బంధుమిత్రులనూ ఇద్దరూ ఆదరిస్తే మీ ప్రేమతోట మరింత ముచ్చటగా ఉంటుంది.

* భార్యాభర్తల్లో ఎవరు ఇంటికి ముందు వచ్చినా రెండోవారికి కాఫీ, టీ లేదా కనీసం మంచినీళ్లు ఇవ్వడం ఆలవాటుగా చేసుకోమని హితవు చెబుతున్నారు సైకాలజిస్టులు. ఈ కృతజ్ఞతలోంచి ప్రేమ అంకురిస్తుందంటున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని