మనసులో మాట చెప్పేయండి

రాధ ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. ఆరు నెలలకే భర్తతో గొడవ పడింది. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న స్నేహితురాలి కాపురం సంతోషంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం పెరగాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలంటున్నారు నిపుణులు.

Published : 17 Apr 2022 02:49 IST

రాధ ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. ఆరు నెలలకే భర్తతో గొడవ పడింది. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న స్నేహితురాలి కాపురం సంతోషంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం పెరగాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలంటున్నారు నిపుణులు.

పరిష్కారం.. ప్రతి చిన్న సమస్యకు భార్యాభర్తలిద్దరూ వాదించుకోవడం, ఎదుటివారి లోపాలను ఎత్తిచూపడం సరైనది కాదు. వైవాహిక బంధంలో మొదట ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలి. అవతలివారి అభిప్రాయాలను గౌరవించాలి. ఆ తర్వాత ఏర్పడేదే నిజమైన ప్రేమ అవుతుంది. ఎదుటివారి బలం, బలహీనతలు తెలుసుకుంటూ, వాటికి విలువనిస్తే వాదోపవాదాలకు తావుండదు.

పరిపూర్ణం.. సమాజంలో ఎవరూ పరిపూర్ణం కాదు. ఎదుటివారి మనసు అర్థం చేసుకొనేవారు నిత్యం సంతోషంగా ఉంటూ, అవతలివారిని ఆనందంగా ఉంచుతారు. సంసారంలో సమస్యలకు దంపతులిద్దరూ వేర్వేరుగా కాకుండా కలిసి పరిష్కారాన్ని వెతకాలి.

అప్పటికప్పుడే... భాగస్వామిపై కోపం వస్తే... మనసులోని అభిప్రాయాన్ని వారెదుట చెప్పేస్తేనే మంచిది. అలాకాకుండా కొందరు తమ కోపాన్ని మనసులో దాచుకొని అవతలివారిపై మరింత అయిష్టం, ద్వేషాన్ని పెంచుకుంటారు. ఇది ఇరువురిమధ్య అనుబంధాన్ని బీటలు వారేలా చేస్తుంది. నచ్చని విషయాన్ని కటువుగా కాకుండా, కాస్త మృదువుగా చెబితే మంచిది. నెమ్మదిగా అయినా ఎదుటివారికి మీ మనసులోని ఆలోచనలు తెలుస్తాయి. దానికి తమ వంతు సమాధానం చెప్పడానికి అవకాశం ఇచ్చినవారవుతారు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటే సమస్యలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని