అసూయను పెంచొద్దు..

కీర్తి కూతురికి తమ్ముణ్ని అమ్మ గారం చేస్తే నచ్చదు. తన స్నేహితురాలిని పొగిడితే కోపం. ఇంట్లో తనను కాకుండా మరెవరిని ముద్దు చేసినా అలకే. ఇది అసూయకు ప్రారంభ దశ అంటున్నారు నిపుణులు.

Published : 07 Oct 2022 00:15 IST

కీర్తి కూతురికి తమ్ముణ్ని అమ్మ గారం చేస్తే నచ్చదు. తన స్నేహితురాలిని పొగిడితే కోపం. ఇంట్లో తనను కాకుండా మరెవరిని ముద్దు చేసినా అలకే. ఇది అసూయకు ప్రారంభ దశ అంటున్నారు నిపుణులు. చిన్నప్పుడే దీన్ని గుర్తించి నియంత్రించకపోతే అది వారితోపాటు పెరిగి పెద్దదై.. మరెన్నో సమస్యలను తెస్తుందని హెచ్చరిస్తున్నారు.

అడిగిందల్లా ఇవ్వడం, పొరపాటు చేసినా ఖండించకపోవడం చిన్నారులకు అలవాటు చేస్తే, తామే అందరికన్నా ఎక్కువ, తమనే మిగతా వాళ్లు ప్రేమగా చూడాలనే ఆలోచన మొదలవుతుంది. ఆ తర్వాత అమ్మానాన్నలు తోబుట్టువులను ముద్దు చేసినా భరించలేరు. వారికి తనకన్నా ఎక్కువ ప్రేమ అందుతోందని అసూయను పెంచుకుంటారు.

పోలిక.. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలను తోబుట్టువులతో పోలుస్తుంటారు. దీనివల్ల తమపై తాము నమ్మకాన్ని కోల్పోతూ న్యూనతకు గురవుతారు.

నియంత్రణ.. చిన్నప్పటి నుంచి పిల్లలపై అతిగారం లేదా తీవ్ర నియంత్రణ.. ఈరెండూ సరైనది కాదంటున్నారు నిపుణులు. ఆరోగ్యకరమైన పోటీతత్వం అలవరచాలి. గెలుపు కోసం పోరాడాలని, ఓటమి వస్తే దాన్నుంచి పాఠాలు నేర్చుకొని తిరిగి ప్రయత్నించాలని చెప్పాలి. సమానభావనతో ఇతరులను ప్రేమించడం నేర్పాలి. పెద్దవాళ్లు కూడా అందరినీ సమానదృష్టితో చూడాలి. పిల్లలకు సమయాన్ని కేటాయించి, వారి మనసు, ఆలోచనలను తెలుసుకోగలగాలి. అసూయ, ఇతరులపై ద్వేషం వంటివి గుర్తిస్తే, ప్రాథమికదశలోనే నియంత్రించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని