నచ్చలేదా.. చెప్పేయండి
అలాంటి దుస్తులు వేసుకోకు, వారితో మాట్లాడకు, ఇలా ప్రవర్తించకు, ఈ సమయంలో బయటకు వెళ్లకు అని కాబోయే వాడు పెళ్లికి ముందే ఆంక్షలు పెడుతున్నాడా? ప్రతి చిన్న విషయానికి అనుమానం వ్యక్తం చేస్తోంటే ఇబ్బంది పడుతున్నారా? ఇలాగైతే జీవితాంతం నడవగలరా.. ఆలోచించుకోండి మరి!

* కాబోయే భర్త ప్రవర్తన మీకు ఇబ్బందికరంగా ఉంటే మీలో మీరు బాధ పడటం వల్ల ఒరిగేదేమీ ఉండదు. కూర్చొని చర్చించండి.
* మీకు నచ్చినట్లుగా ఉండండి. తనకు కావల్సినట్లు ఉండమని ఒత్తిడి తీసుకొస్తే, దానికి ఒక సారి ఒప్పుకొంటే ప్రతిసారీ అదే దారిలో సాగమనే అవకాశాలే ఎక్కువ.
* సమయం మొత్తాన్ని వారికోసమే కేటాయించమని ఒత్తిడి పెంచితే కుదరదని ఖరాకండిగా చెప్పేయండి. నచ్చకపోయినా వారితో ఉంటే మానసికంగా కుంగుబాటుకు లోనవుతారు.
* శారీరకంగా మీకు నచ్చకపోయినా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తే మొహమాటం లేకుండా ఇష్టం లేదని చేప్పేయండి. అలాకాకుండా జాలి పడితే బలహీనతను అలుసుగా తీసుకునే ప్రమాదమూ ఉంది.
* ఏ విషయంలో ఇబ్బంది అనిపించినా మౌనంగా భరించకుండా నేరుగా తెలియజేయండి. మార్చుకుంటే సరి. లేదంటే అలాంటి వారితో మీ జీవితం కొనసాగితే సమస్యల మయం అవుతుంది అంటున్నారు మానసిక నిపుణులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.