ఒంటరిగా ఉంటున్నారా?

ఒంటరితనం అనగానే సాధారణంగా ఇది పెద్దవాళ్లు లేదా ముసలివాళ్లలో మాత్రమే ఉంటుందని అనుకుంటాం. కానీ పిల్లల్లోనూ ఇది కనిపిస్తుందట. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే కాదు అందరూ ఉన్నా కూడా ఒంటరితనం బాధిస్తుందట.

Published : 07 Apr 2023 00:30 IST

ఒంటరితనం అనగానే సాధారణంగా ఇది పెద్దవాళ్లు లేదా ముసలివాళ్లలో మాత్రమే ఉంటుందని అనుకుంటాం. కానీ పిల్లల్లోనూ ఇది కనిపిస్తుందట. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే కాదు అందరూ ఉన్నా కూడా ఒంటరితనం బాధిస్తుందట. దీర్ఘకాలం పాటు ఇలానే కొనసాగితే పిల్లల్లో మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయి అంటున్నారు నిపుణులు.

కొత్త ప్రాంతానికి ఇల్లు మారినప్పుడు, స్కూలు మార్చినప్పుడు పిల్లలకు ఒంటరివారిమనే భావన తలెత్తుతుంది. తల్లిదండ్రుల విడాకులు, కుటుంబ సభ్యులు, లేదా స్నేహితులు దూరమైపోవడం ఇలాంటి సంఘటనలూ పసి హృదయాలను మరింత బాధిస్తాయి. ఆ బాధను చిన్నారులు ఒక్కొక్కరు ఒక్కోలా తెలియజేస్తుంటారు. కొందరు  తమతో ఆడుకోడానికి, మాట్లాడడానికి స్నేహితులెవరూ లేరని బాధపడుతుంటారు. అలాంటప్పుడు వాళ్లు అలానే అంటారులే అని కొట్టి పారేయకూడదు. కొత్త స్నేహాలను ఏర్పరచుకోవడంలో సహాయం చేయాలి.

ఇక, బాగా చదివే పిల్లలు అకస్మాత్తుగా చదవలేకపోతుంటే వారిని ఒత్తిడి చేయొద్దు. ఒంటరితనం వల్ల చదువుపై శ్రద్ధ, ఏకాగ్రత చూపలేకపోతున్నారేమో!  కొన్నిసార్లు చిన్నారులు వారి స్నేహితులు.. కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి సామాజిక మాధ్యమాల్లో దిగిన ఫోటోలు పెడుతుంటారు. వాటిని చూసి ఆ అవకాశం తమకు లేదని బాధపడుతుండొచ్చు. దాంతో  ఆత్మన్యూనతకు గురై కొత్త అంశాలు నేర్చుకోలేరు.  ఇలాంటప్పుడు వారిని దగ్గరకు తీసుకోండి. కాస్త ఎక్కువ సమయం గడపండి. అప్పుడు క్రమంగా ఈ భావన నుంచి బయటకు రాగలరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని