అందాల తారకు అపూర్వ గౌరవం!

అందాల భామ, బాలీవుడ్‌ నటి 27 ఏళ్ల ఊర్వశి రౌతెెలా మహారాష్ట్ర, గోవా గవర్నరు భగత్‌ సింగ్‌ కోశ్యారీ చేతుల మీదుగా ‘స్త్రీ శక్తి జాతీయ పురస్కారాన్ని’ అందుకుంది.  ఇప్పటి దాకా ఈ పురస్కారాల్ని అందుకున్న మహిళల్లో ఊర్వశి పిన్న వయస్కురాలు. ‘అతి చిన్న వయసులో

Published : 30 Jun 2021 02:02 IST

అందాల భామ, బాలీవుడ్‌ నటి 27 ఏళ్ల ఊర్వశి రౌతెెలా మహారాష్ట్ర, గోవా గవర్నరు భగత్‌ సింగ్‌ కోశ్యారీ చేతుల మీదుగా ‘స్త్రీ శక్తి జాతీయ పురస్కారాన్ని’ అందుకుంది.  ఇప్పటి దాకా ఈ పురస్కారాల్ని అందుకున్న మహిళల్లో ఊర్వశి పిన్న వయస్కురాలు. ‘అతి చిన్న వయసులో ఈ అవార్డును అందుకోవడం ఆనందంగా, కాస్త గర్వంగానూ ఉంది. నా నగరంలో... నా దేశంలో నేను గర్వించేలా చేసిన క్షణమిది’ అంటూ తన వీడియో, ఫొటోలను ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకుంది.

కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఊర్వశి కొవిడ్‌ యోధురాలిగా సామాజిక సేవలందిస్తూనే ఉంది. అన్నార్తులకు ఆహార పొట్లాలు పంచడం, రోగులకు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందించడం వంటివి చేసింది. అంతకు ముందు కూడా ముంబయిలో భారీ తుపానులో నిరాశ్రయులకు ఆహారాన్ని సరఫరా చేసింది. వీటన్నింటికీ గుర్తింపుగానే కేంద్ర ప్రభుత్వం ‘స్త్రీ శక్తి జాతీయ పురస్కారం - 2021’తో ఊర్వశిని గౌరవించింది.

2015లో ఊర్వశి ‘మిస్‌ దివా యూనివర్స్‌-2015’గా కిరీటం గెలుచుకుని ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీలకు మన దేశానికి ప్రాతినిధ్యం వహించింది. ‘సింగ్‌ సాహెబ్‌’ సినిమాతో బాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. ‘సనమ్‌ రే, గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ, హేట్‌స్టోరీ4, పాగల్‌పంతి, వర్జిన్‌ భానుప్రియ’ తదితర చిత్రాల్లో నటించింది. మ్యూజిక్‌ వీడియోలూ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

వివిధ రంగాల్లో అసాధారణ కృషి చేసిన వారికి కేంద్ర మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఈ అవార్డును అందజేస్తుంది.ఆత్మస్థైర్యంతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న వారు, మహిళా సాధికారత కోసం పాటుపడే వారు, వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో అతివల సమస్యలపై పోరాడే వారికి ఈ పురస్కారం ఇస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్