ప్రపంచవేదికపై.. మన అమ్మాయిలు!

సాంకేతిక రంగం అమ్మాయిలకు సరిపడదనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఈ రంగంలో మన అమ్మాయిల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసిందో ప్రముఖ సంస్థ. ఎలానో, ఆ సంగతేంటో చదివేయండి మరి!

Updated : 21 Oct 2021 06:05 IST

సాంకేతిక రంగం అమ్మాయిలకు సరిపడదనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఈ రంగంలో మన అమ్మాయిల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసిందో ప్రముఖ సంస్థ. ఎలానో, ఆ సంగతేంటో చదివేయండి మరి!

పిల్‌ తాజాగా కొత్త ఉత్పత్తులను విపణిలోకి ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం టెక్నాలజీ ప్రేమికులకో పండగ. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది చూసిన ఈ వేడుకలో వీటిని ప్రపంచానికి పరిచయం చేసింది ఆ సంస్థ అధినేత టిమ్‌కుక్‌ కాదు.... ఆయా ఉత్పత్తుల రూపకల్పనలో కీలకవ్యక్తులు. వారిలో మన అమ్మాయిలు ఇద్దరున్నారు.

సుస్మితా దత్తా... మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ చేసింది. సిస్టమ్‌ అండ్‌ హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌లో 16 ఏళ్లకుపైగా అనుభవముంది. మొదట కాలిఫోర్నియాలోని ఓ హెల్త్‌కేర్‌ సంస్థలో సిస్టమ్‌ డిజైనర్‌గా చేసి, నాలుగేళ్ల క్రితం ‘ఆపిల్‌’కి మారింది. సంస్థ ఆడియో ప్రొడక్ట్‌లకు ఎస్‌ఓసీ (సిస్టమ్‌ ఆన్‌ చిప్‌) ప్రోగ్రామ్‌ మేనేజర్‌. సంస్థ విడుదల చేసిన నెక్స్ట్‌ జెన్‌ ఎయిర్‌పాడ్‌లకు ఈమె ప్రోగ్రామ్‌ మేనేజర్‌.

శ్రుతి హల్దియా... భారతీయురాలే. పెరిగింది మాత్రం యూఎస్‌లో. డ్యూక్‌ నుంచి పొలిటికల్‌ ఎకానమీ, ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌లో డిగ్రీనీ, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ పట్టానూ అందుకుంది. ఆపిల్‌లో 12 ఏళ్లుగా పనిచేస్తోంది. అంచలంచెలుగా ఎదుగుతూ ప్రో మ్యాక్‌కు ప్రొడక్ట్‌ లైన్‌ మేనేజర్‌ అయ్యింది. కొత్త మ్యాక్‌బుక్‌ను ఈమె పరిచయం చేసింది. ఈ ఉత్పత్తుల తయారీని ముందుంచి నడిపించినందుకు ప్రోత్సాహకంగా వీళ్లకి ఈ అవకాశం దక్కింది. ఇది ఒకరకంగా టెక్‌లో అమ్మాయిల సత్తాని ప్రపంచ వేదికపై ప్రదర్శించడమేననేది నిపుణుల భావన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్