బైసెప్స్‌తో యాపిల్స్‌ చితక్కొట్టి... గిన్నిస్‌ రికార్డు

లిన్సే లిండ్‌బర్గ్‌ యూట్యూబ్‌లో ఏం చేసినా ప్రత్యేకమే.  తన కండ బలాన్ని చూపించే ఆ వీడియోలంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు కన్నులపండుగే. తాజాగా ఆమె పోస్ట్‌ చేసిన ఓ వీడియో  వైరల్‌ అయ్యింది. గిన్నిస్‌ రికార్డునూ అందించింది. అమెరికాకు చెందిన లిన్సే లిండ్‌బర్గ్‌కు చిన్నప్పటి నుంచి వ్యాయామాలంటే ఇష్టం. అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలని కలలు కనేది. సాహసాలు చేసి  వీడియోలను సోషల్‌ మీడియాలో ఉంచేది. వాటికి...

Published : 20 Nov 2021 00:36 IST

లిన్సే లిండ్‌బర్గ్‌ యూట్యూబ్‌లో ఏం చేసినా ప్రత్యేకమే.  తన కండ బలాన్ని చూపించే ఆ వీడియోలంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు కన్నులపండుగే. తాజాగా ఆమె పోస్ట్‌ చేసిన ఓ వీడియో  వైరల్‌ అయ్యింది. గిన్నిస్‌ రికార్డునూ అందించింది.

మెరికాకు చెందిన లిన్సే లిండ్‌బర్గ్‌కు చిన్నప్పటి నుంచి వ్యాయామాలంటే ఇష్టం. అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలని కలలు కనేది. సాహసాలు చేసి  వీడియోలను సోషల్‌ మీడియాలో ఉంచేది. వాటికి అనూహ్య స్పందన వచ్చింది. ఆ ఉత్సాహంతో మరిన్ని చేసేది. అలా ఇటీవల నిమిషంలో పది యాపిల్స్‌ను తన బైసెప్స్‌తో క్రష్‌ చేసేసి, ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసింది. లక్షల్లో అభిమానులు ఆమె కండల బలానికి ఫిదా అయిపోయారు. ‘లిన్సే కాదు... నువ్వు హల్క్‌’ అంటూ ప్రశంసలు కురిపించారు. ట్విస్ట్‌ ఏంటంటే ఈ వీడియో ప్రపంచరికార్డును కొట్టేయడం. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సంస్థ లిన్సే వీడియోను చూసి, తన ఫీట్‌ను గుర్తించి రికార్డు అందజేసింది. గతంలో ఆమె చేసిన కొన్ని వీడియోలు కూడా ఇలానే వైరల్‌కావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్