మొదలైంది.. అమ్మాయిల పంచాయతీ!

అమ్మాయిలూ మీరు రాజకీయాల్లోకి రావాలి అంటూ ఆహ్వానిస్తోంది గుజరాత్‌ ప్రభుత్వం. దీనికోసం ‘బాలికా పంచాయత్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశంలో ఈ తరహాది ఇదే మొదటిది. 11-21 ఏళ్ల వారి కోసం మొదలుపెట్టిన దీన్ని ఆ

Updated : 18 Jun 2022 04:58 IST

మ్మాయిలూ మీరు రాజకీయాల్లోకి రావాలి అంటూ ఆహ్వానిస్తోంది గుజరాత్‌ ప్రభుత్వం. దీనికోసం ‘బాలికా పంచాయత్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశంలో ఈ తరహాది ఇదే మొదటిది. 11-21 ఏళ్ల వారి కోసం మొదలుపెట్టిన దీన్ని ఆ రాష్ట్రంలోని కచ్‌ జిల్లాలోని గ్రామాల్లో ఏడాదిగా నిర్వహిస్తున్నారు. అమ్మాయిల్లో సామాజిక స్పృహను, చైతన్యాన్ని పెంచి వారికి రాజకీయాల పట్ల ఆసక్తి కలిగించడమే దీని ప్రధాన ఉద్దేశం. దాని వల్ల మహిళా సమస్యలు, దురాచారాలపై వారు పోరాడతారన్నది మరో ఉద్దేశం. గ్రామ ఎన్నికల్లానే బాలికా పంచాయత్‌కూ పోటీ ఉంటుంది. ఊరి అమ్మాయిలంతా కలసి దీనికి ఒక సర్పంచ్‌, సభ్యులను ఎన్నుకుంటారు. గ్రామంలోని ఏ అమ్మాయికైనా సమస్య ఎదురైతే అది పరిష్కారమయ్యేలా సర్పంచ్‌ చూస్తుంది. ఉదాహరణకు బాల్యవివాహం జరుగుతోంది. సర్పంచ్‌, సభ్యులు వెళ్లి దాని వల్ల నష్టాలు, అమ్మాయికి ఎదురయ్యే సమస్యలు వంటివి వివరిస్తారు. వాళ్లు అర్థం చేసుకొని ఆలోచన విరమించుకున్నారా.. సరే! లేదూ పంచాయతీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తారు. ఈ పంచాయతీ మంచి ఫలితాలను ఇస్తుండటంతో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ కార్యక్రమాన్ని త్వరలో దేశవ్యాప్తంగా అమలు పరిచే ఆలోచనలో ఉంది. మరి అమ్మాయిలూ మీరు సిద్ధమా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్