..అందుకు భయపడాలి!
వ్యాపారం అభివృద్ధి చెందుతున్న కొత్తలో ఒక పెట్టుబడి దారుడితో సమావేశమయ్యాం నేనూ మా కోఫౌండర్ సంజయ్. ఆయన ఏ సందేహమైనా సంజయ్‌నే అడుగుతున్నాడు. నిజానికి వాటన్నింటికీ సమాధానాలిచ్చింది నేను. అయినా చివరి వరకూ ఆయన పద్ధతి అలానే ఉంది. ఇంకోసారి ఓ ఏడాది మా వ్యాపారం ఊహించని లాభాలు సాధించింది.
అనుభవ పాఠాలు
వ్యాపారం అభివృద్ధి చెందుతున్న కొత్తలో ఒక పెట్టుబడి దారుడితో సమావేశమయ్యాం నేనూ మా కోఫౌండర్ సంజయ్. ఆయన ఏ సందేహమైనా సంజయ్‌నే అడుగుతున్నాడు. నిజానికి వాటన్నింటికీ సమాధానాలిచ్చింది నేను. అయినా చివరి వరకూ ఆయన పద్ధతి అలానే ఉంది. ఇంకోసారి ఓ ఏడాది మా వ్యాపారం ఊహించని లాభాలు సాధించింది. అందుకు పత్రికలో నా ఫొటోకి బదులు అదే పేరుతో ఉన్న వేరే ఆవిడది వేశారు. కనీసం రూఢీ చేసుకోలేదు. ఆడవాళ్లు.. వ్యాపారం ఆమడ దూరమన్న ధోరణే ఈ చిన్నచూపునకు కారణం. ఇది మగ వాళ్లలోనే కాదు.. అమ్మాయిల్లోనూ ఎక్కువే! చేయలేమేమో, మగ వాళ్లతో పోటీపడి రాణించలేమేమో అని వెనకడుగు వేస్తుంటారు. భయపడాల్సింది ఓటమికి కాదు.. కనీస ప్రయత్నం చేయక పోవడానికి. ఇప్పుడు పరిస్థితులూ మారాయి. ఎంతోమంది మహిళల విజయాలే అందుకు ఉదాహరణ. కాబట్టి, ధైర్యంగా ప్రయత్నించండి.
- రాధిక అగర్వాల్, సహవ్యవస్థాపకురాలు, షాప్‌క్లూస్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.