మనిషి కాదు.. మరబొమ్మా కాదు

‘ఓకే గూగుల్‌’ అనగానే కావాల్సిన సమాచారం దొరికేయడం.. డ్రైవర్‌ లేని కార్లు.. చాట్‌బోట్లు.. ఏఐ ప్రతిరూపాలే! ఇన్‌ఫ్లుయెన్సర్ల రూపంలోనూ కృత్రిమ మేధ మనకు పరిచయం అయ్యింది.

Updated : 11 Jul 2023 04:17 IST

‘ఓకే గూగుల్‌’ అనగానే కావాల్సిన సమాచారం దొరికేయడం.. డ్రైవర్‌ లేని కార్లు.. చాట్‌బోట్లు.. ఏఐ ప్రతిరూపాలే! ఇన్‌ఫ్లుయెన్సర్ల రూపంలోనూ కృత్రిమ మేధ మనకు పరిచయం అయ్యింది. తాజాగా వార్తలూ చెప్పడానికి సిద్ధమైందని తెలుసా? ఏ విదేశంలోనో కాదు.. మన దేశంలోనే!

కాటన్‌ చీరలో.. నుదుటన బొట్టు, చెవులకు జుంకీలతో అచ్చమైన భారతీయ వనితకు ప్రతిరూపంలా ఉంది కదూ. ఒడిశాలోని ఒక మీడియా సంస్థ యాంకర్‌ తను. పేరు లిసా. అయితే ఈమెకు ప్రాణమే లేదు. ఈ మాటే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. లిసా.. కృత్రిమ మహిళా యాంకర్‌. ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఈ యాంకరమ్మను సృష్టించారు. అచ్చమైన అమ్మాయిలాగా కనిపిస్తూ వార్తలను గడగడా చెప్పేస్తోంది లిసా. వాస్తవానికి ఈ ఏఐ న్యూస్‌ యాంకర్‌కు దేశంలోని అన్ని భాషలు వచ్చు! కానీ ప్రస్తుతానికి ఒడియా, ఇంగ్లిష్‌ భాషలపైనే దృష్టిపెట్టామంటోంది ఆ మీడియా సంస్థ యాజమాన్యం.

లిసా నిజమైన మనిషి కాదు.. సాంకేతిక మాయ అని తెలియగానే నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నిపుణులేమో ‘దేశ జర్నలిజం చరిత్రలో ఇదో అద్భుతం. కృత్రిమ మేధను అందిపుచ్చుకోవడంలో మైలురాయి’అని ప్రశంసిస్తున్నారు. ముఖకవళికలు, హావభావాలు, భావోద్వేగాలను కచ్చితంగా పాటించగలగడమే కాదు.. రియల్‌ టైమ్‌లో యూజర్ల ప్రశ్నలకు సమాధానాలివ్వడం, తాజా కబుర్లను వెంటనే ఇవ్వగలగడం తన ప్రత్యేకత. అన్నట్టూ లిసాకి సోషల్‌మీడియాలో ఖాతాలూ ప్రారంభించారట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్