దాండియాతో దుమ్మురేపుతారు!

గుజరాత్‌లో దసరా అంటే గార్బా, దాండియా నృత్యాలే గుర్తుకు వస్తాయి. అమ్మాయిలు ఉత్సాహంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. పురాణేతిహాసాల్లోని కథలను నృత్య రూపకాలుగా ప్రదర్శిస్తారు.

Updated : 16 Oct 2023 04:06 IST

గుజరాత్‌లో శరన్నవరాత్రులు

గుజరాత్‌లో దసరా అంటే గార్బా, దాండియా నృత్యాలే గుర్తుకు వస్తాయి. అమ్మాయిలు ఉత్సాహంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. పురాణేతిహాసాల్లోని కథలను నృత్య రూపకాలుగా ప్రదర్శిస్తారు. ఒక్కో రోజును ఒక్కో రంగుకి ప్రతీకగా భావించి ఆ వర్ణం దుస్తులనే ధరిస్తారు. 9 రోజులను మూడు భాగాలుగా విభజిస్తారు. మొదటి మూడు రోజులు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి కొలుస్తారు. ఆ తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవిగా, చివరి మూడు రోజులు సరస్వతిగా పూజిస్తారు. ప్రతి రాత్రి పూజ చివర్లో గార్బాగా పిలుచుకునే చిన్న మట్టి కుండలో అమ్మవారికి హారతినిస్తూ మహిళలు చేసే గార్బా నృత్యం ఇక్కడి ప్రత్యేకం.

పూజా విధానం.. నవరాత్రుల్లో మహిళలు మొదటి రోజున మట్టిలో బార్లీ గింజలు చల్లుతారు. ఎనిమిదో రోజున వెన్న, పాయసం, నువ్వులు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి యజ్ఞం నిర్వహిస్తారు. తొమ్మిదో రోజున తొమ్మిదిమంది బాలికలను నవదుర్గ రూపాల్లో అలంకరించి పూజ చేస్తారు. జిలేబీలు, అప్పడాలు చేసి బంధుమిత్రులకు పంచుతారు. విజయదశమి రోజున బార్లీ మొలకలను స్నేహితులు, బంధువులకు పంచుతారు. పాల ఉత్పత్తులైన పనీర్‌, పెరుగుతో స్వీట్లు చేస్తారు.  

ఉపవాసంలో.. నవరాత్రికి మహిళలు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి పూజ తర్వాత ప్రత్యేకమైన పిండితో చేసే రొట్టెలు తింటారు. ఆహారంలో ఉల్లి, వెల్లుల్లిని ఉపయోగించరు. బంగాళా దుంప, కీరదోస, గుమ్మడి, చిలగడ దుంపలతో చేసే ఆహార పదార్థాలు తీసుకుంటారు. గడ్డ ఉప్పు మాత్రమే ఆహారంలో వినియోగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్